‘నవ్వకపోవడం ఒక రోగం’ అన్న జంధ్యాల
నవరసాల్లో అందరూ అధికంగా మెచ్చేది… ఆస్వాదించేది ‘హాస్యం’. నిజానికి తెలుగు చలనచిత్రసీమలో వున్నంతమంది హాస్యనటులు మరేచిత్రసీమలోనూ లేరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా జంధ్యాల దర్శక పగ్గాలు చేపట్టాక హాస్యం మూడు పాత్రలు ఆరు రీళ్లుగా పురోగమించింది. సినీ రచనలో ఒక భావుకుడిగా, హాస్య స్రష్టగా ప్రేక్షక హృదయాల్లో సముచిత స్థానం సంపాదించాడు జంధ్యాల. చార్టర్డ్ అకౌంటెంట్‌గా స్థిరపడదామని అనుకున్న…