నేడు ఆర్టిస్ట్ , కార్టూనిస్ట్ ‘బాలి’ పుట్టినరోజు
August 16, 2021బాలి అనే పేరు తెలుగు చిత్రకళారంగానికి సుపరిచితమైన పేరు. ఏడున్నర పదుల వయసులోనూ అదే రూపం, అదే జోష్… ఏమీ మార్పు లేదు. ఐదున్నర దశాబ్దాలుగా బొమ్మలతో పెనవేసుకు పోయిన అనుబంధం ఆయనిది… అనకాపల్లిలో పుట్టి, వైజాగ్ ఈనాడులో కార్టూనిస్టుగా అడుగుపెట్టి… తర్వాత విజయవాడ, హైదరాబాద్ మళ్ళీ విశాఖపట్నం ఇదీ బాలి గారి పయణం…. ఎక్కడా రాజీ పడరు….