నేడు బాపు పుట్టినరోజు

నేడు బాపు పుట్టినరోజు

December 15, 2019

ఒక మంచి రచన చదువుతున్నప్పుడు మన మనసులో ఆ రచనలోని రూపాలు మెదలుతాయి. ఆ మనోహర రూపాల సౌందర్యాన్ని నయనానందకరంగా చూపే కుంచె పేరే బాపు. బాపు గీసే బొమ్మలు మాట్లాడతాయి…. సిగ్గుపడతాయి… నవ్విస్తాయి… కవ్విస్తాయి కూడా. బాపు ముఖచిత్రం వేస్తే ఆ రచనకు… ఆ పుస్తకానికి వెయ్యి వోల్టుల కాంతి వస్తుంది… విలువ అతిశయిస్తుంది… బంగారానికి తావి…