మరో ఆత్రేయ జన్మించడు…
May 7, 2020తెలుగు పాటకి..ప్రత్యేకంగా మనసు పాటలకు పట్టం కట్టి పట్టాభిషేకం చేసింది ఆచార్య ఆత్రేయ..కిళ్లాంబి వెంకట నరసింహాచార్యులు..తన పేరు చివర ఉన్న ఆచార్య ని తీసుకుని తన గోత్రం అయిన ఆత్రేయ ని దాని తర్వాత పెట్టి ఆచార్య ఆత్రేయగా స్వయంనామాకరణం చేసుకున్నాడు… జగన్నాధ రథచక్రాలు సినిమా పాటల కొరకు నేను ఒక వారం రోజులు ఆయనతో తిరిగే భాగ్యం…