మల్లాది గారికి రాని భాషలేదు ..!
June 16, 2020అచ్చులో తమ పేరు చూసు కోవాలని, వెండితెర మీద తన పేరు కనిపించాలని కోరుకోని రచయిత ఉండరు. వాళ్ళకి వచ్చినదానికన్నా ఎక్కువ ప్రచారం కోరుకునేవారికి భిన్నంగా తానెంత పండితుడయినా, ఎన్నెన్నో కథలు అల్లినా, అద్భుతమైన పాటలు రాసినా తనదని చెప్పుకోవాలని తాపత్రయపడని వ్యక్తి, తన సాహిత్యంతో డబ్బు చేసు కోవాలన్న యత్నం ఏ మాత్రం చెయ్యని మహాను భావుడు…