వసంతాల విరబూయించిన కవి – వేటూరి
March 25, 2020‘కొమ్మ కొమ్మకో సన్నాయి’ అన్నాడాయన ప్రకృతిని చూసి, ‘ఆమని పాడవే హాయిగా’ అని కూడా అన్నాడు. “ఈ మధుమాసంలో నీ దరహాసంలో అని పచ్చదనంలో పులకరించిపోయాడు. వేటూరి కలానికి వేయి చివుళ్లు. ‘కోయిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి’ అని అందుకే అది అనగలిగింది. వేటూరికి పొన్నచెట్టు నీడ అన్నా, కృష్ణవేణి నడక అన్నా బహుకష్టం. ‘కృష్ణాతరంగాలు తారంగనాదాలు’ అన్న…