శంకర నారాయణ డిక్షనరి కథ
August 5, 2019ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు. ముందు వ్యాపారం చేయడానికి… తరువాత అధికారం చెలాయించడానికి…. వాడి భాష మనకి రాదు… వాడు “గాడ్ ఈజ్ గుడ్” అనేవాడు. మనకి అది “గాడిదగుడ్డు” గా అర్థమైంది. మనం “రాజమహేంద్రి” అన్నాం… వాడికి “రాజమండ్రి”లా వినిపించింది. మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు… వాడి భాష మనకి బోధపడేది కాదు. వ్యాపారం, పరిపాలన…