శిలలకు ప్రాణం పోసిన శిల్పి జక్కన
October 6, 2019‘శిలలపై శిల్పాలు చెక్కినారు..మనవారు సృష్టికే అందాలు తెచ్చినారు..’ అన్నారు ఓ సినీ రచయిత. ఆయన రాసిన ఈ గీతం అక్షరాలా నిజం. ఎందుకంటే శిల్పసౌందర్యం మన దక్షిణభారత దేశంలో అత్యద్భుతంగా పరిఢవిల్లుతోంది.. విదేశీయులను సైతం విశేషంగా ఆకర్షిస్తోంది.. సంస్కృతి సంప్రదాయాలు, సాంఘిక జీవనశైలిని ప్రపంచానికి చాటిచెప్పింది. అంతటి అపురూపమైన శిల్పకళ అంటే ముందుగా గుర్తొచ్చేది అమర శిల్పి జక్కన…..