చిత్ర జగతిలో పున్నమి రేడు… దామెర్ల
(ఫిబ్రవరి 6 న దామెర్ల రామారావు వర్థంతి సందర్భంగా….) ప్రకృతి కాంత చిగురుటాకు చీరకట్టి, చిరువిరులతో చామరాలు వీస్తూ వసంతకాల శోభను చల్లని గాలులతో ఇనుమడింపచేస్తుంది. ఈ మనోహర దృశ్యాలను వర్ణాలతో వర్ణించ గల కుంచే కరువయిన ఈ ఆంధ్రావనిలో ఆ లోటును తీర్చేందుకు ఏ పరలోక దివ్యాతో స్వల్ప వ్యవధికై ఇల అరుదెంచెను, దామెర్ల రామారావు రూపంలో…….