సమాజంలోని సమస్యలపై ప్రశ్నిస్తున్న సింగర్ స్మిత
సింగర్ స్మిత గురించి తెలియని తెలుగువారుండరు. పాప్ సింగర్‌గా, నేపథ్య గాయనిగా, నటిగా ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. విజయవాడకు చెందిన స్మిత తన మ్యూజికల్ జర్నీలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 1997లో ఈటీవీలో ప్రసారమైన ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలో పాల్గొన్న స్మిత.. గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆశీస్సులు పొందారు. ఆ తర్వాత స్వయంగా ‘హాయ్ రబ్బా’…