
సాహితీ సవ్యసాచి-ద్వానా శాస్త్రి
తెలుగులో విమర్శనాత్మక సాహిత్యం కొరవడిన సమయంలో ఆయన తన కళాన్ని ఝళిపించినవాడు. నాలుగున్నర దశాబ్దాలుగా ఎత్తిన కలం దించకుండా విమర్శనారంగంలో నిరంతర కృషి చేస్తున్నవా డు. ఆయన వ్యాసాలు రచయిత హృదయావిష్కరణకు అద్దంపడుతాయి. ప్రాచ్యలక్షణ పరిజ్ఞానాన్ని, పాశ్చాత్య వివేచనాన్ని సమన్వయిస్తూ ఆధునిక పాఠకులకు అవలీలగా అర్థమయ్యే రీతిలో వివరించడంలో ఆయనది అనుభవమున్న కలం. వస్తు వైవిధ్యం, సామాజిక స్పృహ,…