పుస్తకం వారసత్వం కావాలి
(హైదరాబాద్ లో డిసెంబర్ 15 నుండి 25 వరకు పుస్తకప్రదర్శన జరుగుతున్న సందర్బంగా ప్రత్యేక వ్యాసం) మనిషికి తెలిసింది చాలా స్వల్పం. తెలుసుకోవాల్సింది అత్యధికం. తల్లి సుద్దులు చెబుతుంది. తండ్రి మార్గం చూపిస్తాడు. గురువు ఇంగితం నేర్పిస్తాడు. ఏకకాలంలో ఈ మూడు ధర్మాలను స్నేహనిష్ఠతో నిర్వర్తించేది మాత్రం ఈ లోకంలో పుస్తకాలే” అన్నారు మన సర్వేపల్లి రాధాకృష్ణన్. ”పుస్తకాల…