వెండి తెరకు మించిన చరిత్ర నాటకరంగానిది…
February 26, 2021నాటకరంగం… నేటి యువతరం లో అంతగా ఆదరణలేని రంగం. సినిమాలకు ఉండే క్రేజ్ ఈ నాటక రంగానికి ఉండదు. బుల్లితెరకు ఉండే ఆదరణ కూడా ప్రజల నుండి ఈ నాటక రంగానికి ఉండదు. కానీ బుల్లితెర, వెండి తెరకు మించిన చరిత్ర నాటకరంగానిది. ప్రజల్ని చైతన్యపరుస్తూ సమాజంలో నెలకొన్న అసమానతలను రూపుమాపేందుకు సంఘసంస్కర్తలు ఎంచుకున్న మహోన్నత ఆయుధం నాటకం….