art camp at vijayawada

స్వాతంత్రభారతికి చిత్రకళాహారతి

హిమశైల శిఖరం ఎలుగెత్తి పిలిచింది సాగరం ఎదపొంగి స్వాగతం పలికింది ఓ భారతీయుడా స్వాతంత్ర పౌరుడా ఏ జన్మ పుణ్యమో ఈ తల్లి నీదిరా... స్వేచ్ఛాభారతిని కాంక్షించి, లక్షలాదిమంది ప్రాణాలర్పించిన మహోజ్వలమైన ఘట్టం భారత స్వాతంత్ర పోరాటం. ఆంగ్లేయుల పాశవికమైన పాలన నుండి, మన మాతృభూమిని విముక్తం చేయాలని, మనసారా విశ్వసించి తమ జీవితాలను తృణప్రాయంగా ధారపోసిన వీరులు ఎందరో...వీరనారీమణులు మరెందరో. వందేమాతరమంటూ చెరసాలల్లో చిత్రహింసలు అనుభవించిన దేశభక్తులు, జాతీయపతాకాన్ని చేతబూని మండుటెండల్లో బ్రిటీష్ పాలకుల కొరడా దెబ్బలకు శరీరమంతా రక్తం ధారలు కట్టిన త్యాగధనులు ఎందరో.. ఎందరెందరో.. చేతిలో భగవద్గీతతోఉరికంబాల పై ప్రాణాలనర్పినూ, ఏనాటికైనా ఈ భారతదేశం స్వతంత్రం కావాలని మనసారా వాంఛించిన మహితాత్ములు ఇంకెందరో... ఈ దేశభక్తుల, ఈ ధర్మమూర్తుల, ఈ కర్మవీరుల, ఈ త్యాగధనుల త్యాగాల ఫలమే, పోరాటాల ఫలితమే, ప్రపంచ చరిత్రలోనే తిరుగులేనిమహోజ్వలమైన…