వృత్తికి – ప్రవృత్తికీ వన్నెతెచ్చిన చిత్రకారుడు

వృత్తికి – ప్రవృత్తికీ వన్నెతెచ్చిన చిత్రకారుడు

October 18, 2020

ఆర్నేపల్లి అప్పారావు వృత్తి ఒకటిగా, ప్రవృత్తి మరొకటిగా రెండింటికీ వన్నెతెచ్చిన కళాకారునిగా గుర్తించబడ్డారు. చిత్రకళారంగంతో పెనవేసుకున్న కుటుంబంలో జన్మించడం వల్ల కళారంగం వైపు ఆయన మొగ్గు చూపారు. కృష్ణాజిల్లా, ఆత్కూరు గ్రామంలో అప్పలస్వామి, సీతమ్మ పుణ్యదంపతులకు ది. 15-7-1953న నాల్గవ సంతానంగా జన్మించారు అప్పారావు. నాల్గవ సంతానంగా పుట్టటం చేత నలుగురినీ కలుపునే స్వభావం, నలుగురిచేత మంచివాడనిపించుకునే తత్వం…