
బుర్రకథ పితామహుడు పద్మశ్రీ నాజర్
February 9, 2021బుర్రకథ కళారూపానికి ఒక గుర్తింపును…గౌరవాన్ని తెచ్చిన స్రష్ట… ద్రష్ట..నాజరు. ప్రజలచేత… ప్రజలవలన… ప్రజలకొరకు కవిత్వం వ్రాసే కవి కలకాలం అజరామరుడని నమ్మిన నాజర్ కలం పట్టింది మొదలు కన్ను మూసే వరకూ ఆ నిబద్దతతోనే బుర్రకథలు వ్రాశాడు… పాడాడు… ఆడాడు. గుంటూరుకు ఉత్తర దిశగా వున్న పొన్నెకల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి 5న షేక్ మస్తాన్, బీబాబీ దంపతులకు…