రాతలేని ‘గిలిగింతల’ గీతలు
July 13, 2022కార్టూన్ కి భావం ప్రధానం. వ్యాఖ్య సహిత కార్టూన్ హాస్యం, వ్యంగ్యాలని తొక్కొలిచి పండునిచ్చి నవ్విస్తుంది. వ్యాఖ్యరహిత కార్టూన్, సైలెంటుగా వుండి ఆలోచింప చేస్తుంది. పాఠకుడే దాని వ్యాఖ్యను తనకు తోచిన విధంగా తన మనసులో రాసుకుని ఆనందిస్తాడు. రాతల్లేని గీతలతో ‘నవ్యించే’ కార్టూన్లు: కాప్షన్లెస్ కార్టూన్ గీయాలంటే అదేమంత సులభమైన పని కాదు. అందుకు మేధోమధనం చేయాలి….