సామాజిక ప్రయోజనమే వారి కార్టూన్ల లక్ష్యం ఎం.ఎస్.రామకృష్ణ
December 19, 2020ఐదు దశాబ్దాలుగా కార్టూన్లు గీస్తున్న ఎం.ఎస్.రామకృష్ణ గారు ఈ రోజు(19-12-20) ఉదయం కేన్సర్ వ్యాధితో హైదరాబాద్లో కన్నుమూసారు. ప్రముఖకవి శ్రీమునగపాటి విశ్వనాథ శాస్త్రి-విశాలక్ష్మి దంపతులకు ప్రధమ సంతానంగా జన్మించిన ‘రామకృష్ణ’ పూర్తి పేరు మునగపాటి శివరామకృష్ణ, స్వస్థలం తెనాలి తాలూకా ప్యాపర్రు. విద్యాభ్యాసం ఇంటూరు, బాపట్ల హైస్కూళ్ళలో, గుంటూరు హిందూ కాలేజి హైస్కూలు, బాపట్ల కాలేజి ఆఫ్ ఆర్ట్స్…