నేడు ‘చందమామ’ శంకర్ శత జయంతి

నేడు ‘చందమామ’ శంకర్ శత జయంతి

July 19, 2023

చందమామ…..ఈ పేరు వినగానే ఎవరికైనా ఎంతో చల్లగా హాయిగా అనిపిస్తుంది. ఒకప్పటి మన బాల్యం గుర్తుకొచ్చి….ఆపైన ‘చందమామ’ కథల పుస్తకం గుర్తొచ్చి….మనసునల్లరల్లరి చేస్తుంది. అందులో రంగురంగుల బొమ్మలు మైమరపిస్తూ ఊహాలోకాల్లో విహరింప చేస్తుంది… చందమామ బాలల మాసపత్రికలో కథలు ఎంత బాగుండేవో, బొమ్మలు కూడా అంతే బాగుండేవి. ఆ బొమ్మలను చూసే కథల్లోకి వెళ్లే వాళ్లంటే అతిశయోక్తి కాదు….