తెలుగు వెండితెరకు తొలి టాకీ కృష్ణుడు… సియ్యస్సార్

తెలుగు వెండితెరకు తొలి టాకీ కృష్ణుడు… సియ్యస్సార్

July 14, 2022

టాకీలు రాకముందు అంటే 1932 కు పూర్వం ప్రజలకు వినోద సాధనం నాటకాలే. టాకీలు వచ్చిన కొత్తల్లో నాటకరంగం నుంచి సినిమారంగంలోకి ఎంతోమంది గొప్పగొప్ప రంగస్థలనటులు వచ్చారు. వారిలో కొందరు ప్రేక్షకుల మదిలో సుస్థిరస్థానం సంపాదించారు. హరిశ్చంద్రుడు అంటే డి.వి.సుబ్బారావు, సత్యభామ అంటే స్థానం నరసింహారావు, దుర్యోధనుడు అంటే మాధవపెద్ది వెంకట్రామయ్య, యముడు/కంసుడు అంటే వేమూరు గగ్గయ్య, నారదుడు…