పాత్ర పోషణలో మంచి చెడ్డల ఉమ్మడి… గుమ్మడి
January 26, 2022గుంటూరు జిల్లా తెనాలికి సమీపంలో వుండే కొల్లూరు గ్రామంలో ఆ రోజు ‘పేదరైతు’ అనే నాటకం జరుగుతోంది. ఆ పిల్లాడికి పట్టుమంటే పదిహేనేళ్లు కూడా లేవు. నూనూగు మీసాలు కూడా రాలేదు. తొంభై ఏళ్ల ముసలిరైతు వేషం కోసం అతనికి మేకప్ వేశారు. ఆ నాటకంలో ప్రధాన పాత్ర ఆ కుర్రాడిదే. ప్రార్ధనా గీతం అవగానే తెర లేచింది….