సిక రాజు గారు మెచ్చుకున్న కార్టూనిస్ట్ ‘రామారావు ‘
January 10, 2021“రామారావ్” పేరుతో కార్టూన్లు వేస్తున్న నా పూర్తి పేరు కొడాలి సీతారామారావు. నేను ఏ.పి.ఎస్ఆర్.టీ.సీ. లో అక్కౌంట్స్ ఆఫీసరుగా 2011లో పదవీ విరమణ చేశాను. ప్రస్తుతం విజయనగరంలో వుంటున్నాను. పుట్టిన వూరు బందరు.నాకు ఏడేళ్ళ వయసునించీ పుస్తకాలు చదవటం అలవాటయింది. మా ఇంటికి ఆంధ్రపత్రిక వారపత్రిక వచ్చేది. మా నాన్నగారు ఆఫీసు నుంచి ప్రజామత, ఆంధ్రప్రభ, చందమామ లాంటి…