సినీ కవికుల గురువు… మల్లాది
September 12, 2022(మల్లాది పుట్టినరోజు సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం…) తెలుగు సారస్వతాన్ని అభిమానించే సాహితీ ప్రియులకు అతడు ఒక విశ్వవిద్యాలయం. సంప్రదాయపు వైభవాన్ని, సంస్కృతీ వికాసాన్ని, వాటిలో వున్న మాధుర్యాన్ని చవిచూడాలంటే ఆ విద్యాలయ కులపతి మల్లాది సాహిత్యాన్ని చదువుకోవాలి. మల్లాది సాహిత్యాన్ని అధ్యయనం చేసినవారు అనిర్వచనీయమైన రసానుభూతిని పొందుతారు అనే విషయాన్ని ఎందరో గుర్తించారు. “సినిమా పాటకు మల్లాది…