సాహితీ తపస్వి ‘మునిసుందరం’

సాహితీ తపస్వి ‘మునిసుందరం’

June 30, 2021

ఆ యువకుడి వైపు అలానే చూస్తూ ఉండిపోయారు గరికిపాటి రాజారావు. తనను చూడడానికి వచ్చిన ఆ విద్యార్థి కళ్ళలో కన్పిస్తున్న వినయం, నిలబడిన పద్ధతిలో ప్రకటితమయ్యే వినమ్రత, అభివాదం చేసే చేతుల్లో కన్పించే ఆదరం, వేసుకొన్న తెల్లని దుస్తుల్లో విన్పించే స్వచ్ఛతా రాగం . . . ఇవన్నీ… చూస్తూ; ఆయన ఏదో తెలియని ఆత్మీయతా భావనకి లోనయిపోయారు….