ఇసైజ్ఞాని ‘సినీ’ పద్మవిభూషణం
June 2, 2022“చిత్రగాన కల్పవృక్షానికి ఫలపుష్పభరితమైన కొమ్మలెన్నో! అందులో ఇళయరాజా ఒక చిటారుకొమ్మ. నాభిహృత్కంఠ రసనల ద్వారా ఉద్భవించి ఉరికివచ్చే సప్తస్వర సుందరులను భజించిన నాదయోగులలో ఇళయరాజా ఒకరు’ అంటూ ఇళయరాజా ప్రాభవాన్ని, ప్రాశస్తిని కొనియాడింది ప్రముఖ సినీ గేయరచయిత వేటూరి సుందరరామమూర్తి. ఈ ఉపమానం చాలు ఇళయరాజా గొప్పతనాన్నిచెప్పడానికి. “సహజమైన సంప్రదాయ వాద్యపరికరాలతో సంగీతం సమకూర్చితే అందులో మనకు ఆత్మ…