
తెలుగుసంస్కృతి తలఎత్తి నిలబడింది..
May 30, 2022అభిమానులకు.. తెలుగునేలకు.. విశ్వవ్యాప్తంగా వెలుగులీనుతున్న తెలుగుజాతికి..నందమూరి బాలకృష్ణ నమస్సుమాంజలి…. మా నాన్నగారు సినీరంగంలో అడుగుపెట్టారు.భారతీయ సినిమా తెలుగు సినిమాని తలఎత్తి చూసింది..తెలుగుదేశంపార్టీని స్థాపించారు.. తెలుగుసంస్కృతి తలఎత్తి నిలబడింది..ఆ నందమూరి తారక రామునికి ఈ నెల 28వ తేదీతో నూరవ ఏడు మొదలవుతుంది..ఆ రోజు నుంచి, 2023 మే 28 వరకు, 365 రోజులపాటు శతపురుషుని శత జయంతి వేడుకలు…