వెండితెర ‘వీరమాత’… కన్నాంబ
October 5, 2022(నేడు పసుపులేటి ‘కన్నాంబ’ జయంతి) నాటకం రసవత్తరంగా సాగడం లేదు. నడవాల్సిన విధంగా సన్నివేశం నడవడం లేదు. నటించాల్సిన విధంగా పాత్రధారులు ఎవరూ నటించడం లేదు. అందులోనూ అది రోహిణీ కార్తె. పేరుకు మాత్రమే అది రాత్రి కానీ, వేడి, ఉక్క మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రోజంతా భానుడి ప్రతాపానికి బలైపోయిన ప్రజలు, రాత్రివేళ, అంత ఉక్కబోతలోనూ ఆ…