‘కవితా’పయోనిధి… దాశరథి

‘కవితా’పయోనిధి… దాశరథి

July 22, 2022

తెలంగాణ విముక్తి కోసం తన కవితను ఆయుధంగా మలచి ఉద్యమించిన ‘సుకవి’ అతడు. నిజాం పరిపాలనలో తెలంగాణ ప్రజల అగచాట్లను, కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలచి పీడిత ప్రజల గొంతును వెలుగెత్తి నినదించిన ఉద్యమ కారుడతడు. అందుకు ఆ నిరసనకారుడు ధారపోసిన కవితాధార ‘అగ్నిధార’. “ముసలి నక్కకు రాచరికంబు దక్కునే…ఓ… నిజాము పిశాచమా, కానరాడు నిన్నుబోలిన రాజు మాకెన్నడేని” అని…