బులుసు అపర్ణ గారి ‘ద్విశతావధానం’
August 29, 2024పురుషాధిక్య సమాజంలో కొన్ని రంగాలు పురుషులకే పరిమితం. కవిత్వం, అవధానం, ఫోటోగ్రఫీ, ఆటోమొబైల్ రంగం ఇలాంటి వాటన్నిటి పైన కాపీరైట్ మగవాళ్ళకే. ఆకాశంలో సగం స్త్రీలు. 80 ల తర్వాత కవితాకాశంలో మహిళలు మెరవడం ప్రారంభించారు. ఇక అవధానం… ఇలాంటి ప్రక్రియల్లో స్త్రీల పేర్లను వెతుక్కోవాల్సిందే. ఇలాంటి సమయంలో బులుసు అపర్ణ గారు అవధానిగా పేరు పొందారు. ఇటీవల…