రంగస్థలమే దీక్షిత్ గారి ప్రాణం!

రంగస్థలమే దీక్షిత్ గారి ప్రాణం!

July 28, 2021

బతికినంత కాలం రంగస్థలమే ఊపిరిగా జీవించారు. ఉన్నా లేకున్నా దర్జాగా బతికారు. ఎవరేమనుకున్నా చెదరని చిరునవ్వుతోనే ఉన్నారు. ఆతిథ్యం ఇవ్వడం లో తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఎందరికో నటనలో ఓనమాలు దిద్దించి నటనకే కొత్త భాష్యం చెప్పి చూపించి అందరికీ మాష్టారు అయ్యారు. ఆయన కోరుకున్నట్లుగానే షూటింగ్ సెట్ లోనే కనుమూశారు…ఆ మాష్టారు మరెవరో కాదు… డి.ఎస్.దీక్షిత్…