తెలుగు కార్టూనిస్టుల సంతకాలు
October 19, 2020రెండు సున్నాల మధ్య ఒక నిలువుగీత. ఇది వడ్డాది పాపయ్య గారి సంతకం. దీని అర్ధం ఏమిటని అడగ్గా , ” ముందు సున్నా, వెనక సున్నా, మధ్య నేనున్నా” అని సమాధానం ఇచ్చారు. కొంచెం అర్ధమయ్యేలా చెప్పండి అంటే, నిన్న గురించి మరిచిపో, రేపు గురించి ఆలోచించకు, నేడు అంతా నీదే, నిముషం వృధా చెయ్యకు, అన్నారు…