వేదాంత గానకోవిదుడు… ముఖేష్
August 30, 2023సంగీతం విశ్వజనీనం. వాద్య స్వరసమ్మేళన రాగమాధుర్యంతో సమ్మోహింపజేసేదే పాట. ఏ పాటైనా నిత్యనూతనంగా నిలిచిపోవాలంటే, బాణీ, భావం బాగున్నంత మాత్రాన కూడా సరిపోదు. గాయకుని గొంతులోని మార్దవం, స్వచ్ఛత, ప్రత్యేకత, ప్రతిభ కలిస్తేనే ఆ పాట సుదీర్ఘకాలం సుమధురగీతంగా నిలిచిపోతుంది. ఏ పాటకైనా స్వరం ఆధారం. స్వరం వేరు, స్వరస్థానం వేరు. అనుస్వరంతో పాడితే అది ఒక అద్భుతగీతం…