
శిలల్లో శివుని స్థాపించే స్థపతి- వేలు
June 20, 2024“ఉలి దెబ్బకు తాళలేని రాయి గుడి ద్వారానికి మెట్టయితే, దెబ్బలన్నింటికీ ఓర్చి నిలిచిన బండరాయి పూజలందుకునే దైవంగా నిలిచింద”న్న చందంగా ఓ మనిషి జీవితంలో నిరూపితమై, మనకు అనుభవశాస్త్రంగా నిలిస్తే అదే వేలు ఆనందాచారి జీవితం! ఎన్నెన్ని కష్టాలు, కరువులు, దిగుళ్ళు, విచారాలు, విషాదాలు!! అయినా ఆయిన ఎక్కడా అదరలేదు, బెదరలేదు. ఒంగి నడవలేదు. విథి వెక్కిరింతలను పాఠాలుగా…