“విశ్వమోహిని” యామిని కృష్ణమూర్తి ఇకలేరు
August 4, 2024సాంప్రదాయ శాస్త్రీయ నాట్య వటవృక్షం కూలిపోయింది! మువ్వల సవ్వడి ఆగిపోయింది! నాట్యం కోసమే జీవితాన్ని అంకితం చేసిన నాట్య తపస్విని ముంగర యామిని పూర్ణతిలకం కృష్ణమూర్తి కాసేపటి క్రితం తుదిశ్వాసవిడిచారు. ఆమె వయసు 83. వృద్ధాప్య ఇబ్బందులతో ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సి నాట్యాలలో ఢిల్లీ కేంద్రంగా ఎన్నో ప్రయోగాలు చేశారు….