
వెయ్యి అక్షరాలు చెప్పాల్సిన విషయాన్నీ ఒక్క కార్టూన్ ద్వారా చెప్పొచ్చని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కే.వీ. రమణాచారి అన్నారు. శుక్రవారం (20 మే 2022) హైదరాబాద్, రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో సత్కళాభారతి, హాస్వానందం పత్రిక సంయుక్తంగా 2022 తెలుగు కార్టూనిస్ట్ దినోత్సవ సభ నిర్వహించారు. హాస్యానందం నిర్వహించిన కార్టూన్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. రమణాచారి విజేతలను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తలిశెట్టి రామారావు జయంతిని తెలుగు కార్టూనిస్ట్ దినోత్సవంగా జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. కార్టూనిస్టులను ప్రోత్సహిస్తూ, వారికి పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
2022 సంవత్సరపు స్వర్గీయ శేఖర్ అవార్డును కార్టూనిస్ట్ శేఖర్ గారికి, బాపు రమణ పురస్కారం ను కార్టూనిస్ట్ ప్రసిద్ధ గారికి రాగతి పండరి పురస్కారం కార్టూనిస్ట్ శ్రీమతి సునీల గారికి అందజేశారు.
కార్యక్రమంలో సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, సినీ దర్శకుడు శివనాగేశ్వరరావు, జి.వెంకట్‌రెడ్డి, శంకర్, సుబ్బరాజు, సరసి, జి.సత్యనారాయణ, బ్నిం, రాము విజేతలను సత్కరించారు. ఈ పోటీల్లో మొదటి బహుమతిగా వందన శ్రీనివాస్, రెండో, మూడో బహుమతిగా పైడి శ్రీనివాస్, శ్రీకు అందజేశారు.

Cartoonist Sri Haragopal thama thandrigaari peru meeda nirvahinchina poteelaku, Ugaadiki NCCF nirvahinchina poteelaku kooda ide vedika meeda prize distribution jarigindi.