- మొత్తం 25 మందికి లక్ష రూపాయల నగదు బహుమతులు
– తానా కార్టూన్ల ఈ పుస్తకాన్ని ముఖ్యఅతిథిచే ఆవిష్కరణ
విజయవాడ, ఆదివారం ఉదయం సర్వోత్తమ గ్రంథాలయంలో ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్య విభాగం “తానా ప్రపంచసాహిత్య వేదిక” ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో “తెలుగు భాష, సంస్కృతిపై” నిర్వహించిన కార్టూన్ల ప్రదర్శన, కార్టూన్ల పోటీల విజేతలకు బహుమతి ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. తానా కార్టూన్ల ఈ పుస్తకాన్ని ముఖ్యఅతిథి ఆవిష్కరించారు
.
తానా కార్టూన్ ఈ-పుస్తకం కొరకు క్రింది లింక్ క్లిక్ చేయండి….
(Download the e-book here)
సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆం.ప్ర. హైకోర్ట్ న్యాయమూర్తి యు. దుర్గా ప్రసాదరావు, కౌముది పత్రిక ఎడిటర్ కిరణ్ ప్రభ, ఆం.ప్ర. శాసనసభ పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ విజేతలకు బహుమతులందజేశారు.
తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వహకులు తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ…. చిత్రకళలో ఒక భాగమైన వ్యంగ్యచిత్రకళ (కార్టూన్) కూడా చాలా శక్తివంతమైన కళ. వివరణ అవసరం లేకుండా సూటిగా, సంక్షిప్తంగా, విషయాన్ని పాఠకుడి హృదయానికి హత్తుకునేలా చేసే గొప్ప కళా మాధ్యమం కార్టూన్. అలాంటి కార్టూన్ కళ ద్వారా తెలుగు భాష, సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని నేటి తరానికి తెలియజేయాలని, మన భాష, సంస్కృతుల యందు మనం చూపుతున్న నిర్లక్ష్యం వల్ల మనం ఎలాంటి దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియజేయాలని తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ఈ కార్టూన్ పోటీలు నిర్వహించామన్నారు.
మండలి బుద్ధప్రసాద్ గారు మాట్లాడుతూ ఇంత పెద్ద మొత్తంలో బహుమతులు అందజేసి కార్టూనిస్టులను ప్రోత్సహిస్తున్న తానా వారిని అభినందిచారు. భాషా, సాహిత్యాలకు, కళలకు తానా సంస్థ చేస్తున్న కృషిని కొని
ఆం.ప్ర. హైకోర్ట్ న్యాయమూర్తి యు. దుర్గా ప్రసాదరావుగారు మాట్లాడుతూ… ఒకప్పుడు పత్రికలలో కార్టూన్లకే ఎక్కువ ఆదరణ వుండేదన్నారు. అయితే ఒకప్పటిలా పత్రికలకు నేడు ఆదరణ లేదన్నారు. “తెలుగు భాష, సంస్కృతిపై” కార్టూన్ పోటీ నిర్వహించిన ‘తానా’ ను అభినందించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్టూన్ ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది.
అత్యుత్తమ కారూన్ల విభాగంలో విజేతలు –12 మంది (ఒక్కొక్కరికి 5,000/- రూ. నగదు బహుమతి):
ఉత్తమ కార్టూన్ల విభాగంలో విజేతలు –13 మంది (ఒక్కొక్కరికి 3,000/- రూ. నగదు బహుమతి) మొత్తం 25 మందికి లక్ష రూపాయల నగదు బహుమతులు.
ఈ సభలో కార్టూన్ పోటీ నిర్వహణ కమిటీ సభ్యులు కళాసాగర్, సరసి, కలిమిశ్రీ, జకీర్ తదితరులు పాల్గొన్నారు.
Nice event sir congratulations to all the winners