నాట్యం-సంగీతం కోర్సుల ప్రవేశానికి ఆహ్వనం

ముగిసిన తానా-కళాశాల నాట్యం-సంగీతం వార్షిక పరీక్షలు.
వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం!

తానా సంస్థ – పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న కూచిపూడి, భరతనాట్యం మరియు సంగీతం కోర్సు విద్యనభ్యసిస్తున్న 400 మంది విద్యార్థులకు( ప్రవాస తెలుగు చిన్నారులు) పైగా థియరీ-ప్రాక్టికల్ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేశారని తానా-కళాశాల కార్యక్రమ అధ్యక్షుడు అడుసుమిల్లి రాజేష్ తెలిపారు. పద్మావతి విశ్వవిద్యాలయ ఉప-కులపతి ప్రొఫెసర్ దువ్వూరు జమున మాట్లాడుతూ ఈ కోర్సులు మన భారతీయ కళలు వాటితో పాటు మన సంస్కృతి సంప్రదాయాలు పట్ల అమెరికాలో పుట్టి పెరుగుతున్న చిన్నారులకు ఆసక్తి అవగాహన పెంపొందించడానికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి ఈ కోర్సులను అమెరికా అంతటా విస్తృత పరచడానికి సంస్థ కృషి చేస్తుందన్నారు. ప్రవాస చిన్నారుల దైనందినిని దృష్టిలో ఉంచుకుని, పాఠ్యప్రణాళికను పక్కాగా రూపొందించామని, ఒక క్రమపత్థతిలో విద్యాబోధన, పరీక్షలు నిర్వహించామని రాజేష్ తెలిపారు. 2021-22 సం. ప్రవేశానికి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, https://courses.tana.org/kalasala/ లంకె ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చునని వెల్లడించారు. ఈ కోర్సులో రిజిస్టర్ అవ్వడానికి నవంబర్ 30, 2021 ఆఖరు తేదీగా ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap