నాకు జీవిత చరిత్రలు చదవడమంటే నా చాలా ఇష్టం” ఎంచేతంటే ఎంత
కల్పనున్నా, కొన్నైనా నిజాలుండక తప్పవు. ఆ నిజాలు కల్పనకన్నా అద్భుతంగా ఉంటాయి గనక!
నేడు ఏడుతరాలు ఎలెక్స్ హేలీ తెలుగు అనువాదం చదువుతుంటే నేను అమ్మ అని పిలిచే సుందరం భార్య శిరీషగారు, “ఎందుకలా వెక్కి వెక్కి ఏడుస్తున్నావు” అని అడిగారు, రాత్రి రెండింటికి. పుస్తకం చూపించాను: “వర్రే, ఏడవచ్చు” అన్నారు. ఆ తరువాత శ్రీపాద వారి “అనుభవాలు, జ్ఞాపకాలూనూ”; తిరుమల రామచంద్రగారి “హంపి నుంచి హరప్పదాకా”; దాశరథి కృష్ణమాచార్యగారి “నా జీవన యానం” పుస్తకాల్ని ఎంతమందికి రికమెండ్ చేశానో… చాలా కాలానికి ఇదిగో “పొలమారిన జ్ఞాపకాల’ మీద ఆర్టికల్… ఈ మధ్య వంశీగారు ఫోన్ చేసి, “నేను ఊరికి దూరంగా ఉంటున్నాను” అన్నారు.
“ఇండస్ట్రీకి కొత్త రైటర్ దొరికాడు, నా నెక్స్ట్ పిక్చర్ కి మీరే రైటర్” అన్నారు…
అలా ఆలాపనకి రాశా… కానీ, సరిగ్గా ఆడలేదు… తరువాత లేడీస్ టైలర్… రాజోలులో తీశారు. సూపర్ హిట్!!
మళ్ళీ నేను వెనక్కి తిరిగి చూసు కోలేదు…ఇప్పుడు ఈ ‘పొలమారిన జ్ఞాపకాలు’ చదువుతుంటే; రీళ్ళు తిరుగుతున్నాయి… బుర్రలో !….
ఎంచేతంటే ఆయన పరిచయ మున్న చాలామంది వ్యక్తులు నాకు కూడా కామన్ ఫ్రెండ్స్…చాలా సీన్లలో నేను, నా పాత్ర కూడా ఉంటాయి… ఇది ఒక ‘ఫోటో బయోగ్రఫీ…’ చాలా అద్భుతమైన ప్రక్రియ… ఈ ‘పొలమారీన జ్ఞాపకాలు’ మనసుకు అత్తుకుపోతున్నాయి. ఒక్కోసారి ఆయన జోక్ తేనెలో ముంచిన సూదితో పొడిచినట్టు… చురుక్కుమంటుంది….
వంశీగారితో ప్రయాణంలో నాకెన్నో అనుభూ తులు, ఎంతో సక్సెస్, కొంత బాధ, కొన్ని కన్నీళ్ళు, చాలా కామెడీ, అదో ‘కెలెయిడో స్కోప్…’ ఇప్పుడాయన అడిగారని కాదుగాని, ఆయనమీద ఎప్పుడో రాసుకున్న కవిత –
“స్టారు లేని సితారను మీటినాడు వంశీ;
అన్వేషణతోటి హడలగొట్టినాడు వంశీ;
అరకు వరకు అందాలను రాసిపోసి వంశీ:
గోదావరి తల్లి ఒడిన సేదతీరు వంశీ;
లేడీస్ టైలర్ ఊహల జమజచ్చే వంశీ;
కనకమహాలక్ష్మి కంటికాటుక రేఖే వంశీ;
భావుకుడు, స్వాప్నికుడు, బాధితుడు వంశీ;
ఒంటికాయి శొంఠికొమ్ము కంట నీరు వంశీ;
“నేను వస్తా అన్నాను” “అంటారు గాని, రారు” అన్నారు.
ఒకరోజు వెళ్ళా. అవును… ఊరికి దూరమే, కాని, వెళ్ళాల్సినంత దూరమే.
వంశీగారు కథలా రాయట్లేదు, చెప్తున్నారు: మళ్ళీ మాట్లాడితే, కథ చూపిస్తున్నారు… ప్రతీదీ ఒక షార్ట్ ఫిల్మే…!!
వంశీగారికి నల్లపిల్ల (ఆడపిల్లలంటే ఇష్టం), పెద్ద బొట్టు పెట్టుకున్న ఆడాళ్ళంటే ఇష్టం, ఆయన అలవోకగా జోకేసేస్తారు, అయితే అది అందుకోవడం అందరికీ సాధ్యం కాదు… మెరుపు మెరిసి మాయం అయ్యేలోపలే పట్టెయ్యాలి! – పసలపూడి కథలతోటి పచ్చి తెలుగు వంశీ, సినిమా పై వెర్రి ప్రేమ పిచ్చివాడు వంశీ;
‘పొలమారిన జ్ఞాపకాల’ పాతరగద వంశీ ;
నలుపు, తెలుపు రంగుల్లో జాతర మన వంశీ….”
ఇష్టంగా,
– తనికెళ్ళ భరణి
సుమారు ఇరవై వారాలుగా స్వాతి వీక్లీలో వస్తున్న ఈ కథలకు చిత్రకారుడు సురేష్ కడలి బొమ్మలు మరింత వన్నె తెస్తున్నాయి.
Great director.