సిద్ధార్థ కళాపీఠంలో తెలుగు పోటీలు 

ఏప్రిల్ 15న విజయవాడలో తెలుగుసాహిత్య క్విజ్, పద్య అంత్యాక్షరి, చిత్రరచన, పద్యగానం, గద్యపఠనం పోటీలు

విజయవాడలోని ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం, పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, తెలుగుశాఖ సంయుక్తంగా ఏప్రిల్ 15న పీబీ సిద్ధార్థ వెబినార్ హాలులో నిర్వహించే తెలుగువెలుగు పోటీల కరపత్రాన్ని శుక్రవారం సిద్ధార్థ అకాడమీ కార్యాలయంలో సిద్ధార్థ కళాపీఠం ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ లలితప్రసాద్, ప్రిన్సిపల్ డా. మేకా రమేశ్, డైరెక్టర్ వేమూరి బాబూరావు, శ్రీదుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల కన్వీనర్ చనుమోలు కృష్ణారావు, ఉయ్యూరు ఏజీ ఆండ్ ఎస్.జి. కళాశాల కన్వీనర్ తాతినేని శ్రీహరిరావు, స్పెషల్ ఆఫీసర్ డా.కొడాలి సత్యనారాయణ, తెలుగు శాఖాధిపతి డా. సశ్రీ విడుదల చేశారు. పాఠశాల, కళాశాల స్థాయిలో తెలుగుసాహిత్య క్విజ్, పద్య అంత్యాక్షరి, చిత్రరచన, పద్యగానం, గద్యపఠనం పోటీలు నిర్వహిస్తున్నామని, ఆసక్తి కలిగిన విద్యార్థులు 9989844001 నంబరుకు ఫోను చేసి పేర్లు నమోదు చేసుకోవాలని వారు కోరారు.
పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రశంసపత్రం, పుస్తక బహుమతి ఇస్తామన్నారు. 

Share via
Copy link
Powered by Social Snap