భీమవరంలో ‘అంతర్జాతీయ తెలుగు సంబరాలు’

“ఆంధ్ర సారస్వత పరిషత్” భీమవరం వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ తెలుగు సంబరాలు.
ప్రాచీన తెలుగు భాష “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్”గా ప్రశంసించబడి, ప్రపంచవ్యాప్తంగా రెండవ ఉత్తమ లిపిగా గుర్తించబడి, ఎన్నో అపురూపమైన అష్టావధానము, శతావధానము, అనవద్యమైన పద్య విద్య వంటి సాహితీ ప్రక్రియలలో అత్యంత పేరెన్నికగన్న చక్రవర్తులచే, కవిశేఖరులచే, పండిత పరమేశ్వరులచే, చేయి తిరిగిన రచయితలచే ప్రశంసించబడుతున్నదీ ఆంధ్రభాష. అద్భుతమైన చరిత్ర గలిగి, గొప్ప వారసత్వ సంపదతో ఆశీర్వదించబడిన తెలుగు “ఆంధ్ర భాష”గా ప్రాముఖ్యతను సంతరించుకుంది.

జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో వివిధ కార్యక్రమాల ద్వారా తెలుగు సంస్కృతీ వికాసానికి, ప్రగతికీ, ప్రాచీన తెలుగు భాష యొక్క గుర్తింపు మరియు వారసత్వాన్ని ప్రోత్సహించి, తెలుగు భాష యొక్క గౌరవాన్ని నిలబెట్టే దిశగా పని చేస్తున్నదీ “ఆంధ్ర సారస్వత పరిషత్”

సదస్సుల వివరాలు.

  1. అవధాన, పద్య సాహిత్యం
  2. గద్య, నవల, కథా సాహిత్యం
  3. జానపద సాహిత్యం
  4. బాల సాహిత్యం
  5. వాగ్గేయకార సాహిత్యం
  6. సంపాదకీయ సాహిత్యం
  7. ఆధునిక సాహిత్యం
  8. చలనచిత్ర సాహిత్యం
  9. అనువాద సాహిత్యం
  10. హాస్య మరియు వ్యంగ్య సాహిత్యం
  11. నాటక సాహిత్యం
  12. ప్రదర్శనాత్మక కళల సాహిత్యం
    ఇతరములు…
    Venuve: West Berry High School Grounds, Peda Amiram, Bhimavaram, W.G. Dist.
Book Inauguration

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap