గిన్నిస్ బుక్ రికార్డ్ పరిశీలనలో ‘భారతవర్ష’ నవల

ఎనిమిది నెలల్లో 1265 పేజీల రచన:
వేయి పేజీలు దాటిన నవలల రచన చేయాలంటే రచయితలు సుమారు పది సంవత్సరాలు తీసుకుంటారు. గాన్ విత్ ద విండ్ 1043 పేజీల నవల రచనకు మిట్చెల్ అనే ఆంగ్ల రచయిత్రి 10 సంవత్సరాలు, క్రొక్టర్ అనే అమెరికన్ రచయిత జురాసిక్ పార్క్ రచనకు అంతే సమయం తీసుకున్నారు. ఫ్రెంచ్ రచయిత విక్టర్ హ్యూగో లే మిజరబుల్స్ అనే నవలకు 12 సంవత్సరాలు తీసుకున్నారు. కాగా విజయవాడకు చెందిన రచయిత ‘పూలబాల’ వెంకట్ తన వృత్తపద్యాలతో గ్రాంధిక తెలుగు నుపయోగించి వ్రాసిన భారతవర్ష అనే నవలను ఎనిమిది నెలల్లో రచించడమే కాక సొంతంగా కంపోజ్ చేసి ముద్రించి నాగార్జునా విశ్వవిద్యాలయ తెలుగు పీఠాధిపతి ఆచార్య ఎన్.వి. కృష్ణారావుగారు, నందమూరి లక్ష్మి పార్వతి వంటి ప్రముఖులకు కూడా అందజేశారు.

Poolabala with Nandamuri Lakshmi Pravathi

‘భారతవర్ష’ ముద్రణలో కూడా రికార్డ్:
నట్లు విప్పాలంటే రెంచ్ కావాలి. పుస్తకాలు కంపోజ్ చేయడానికి పేజ్ మేకర్ కావాలి. మైక్రోసాఫ్ట్ వర్డ్ లో పుస్తకం కంపోస్ చేస్తే తాటిమట్ట కి ఎదురు దేకినట్టే. దీనికి తోడు ట్రాన్స్ లిటి రేషన్” ద్వారా 1265 పేజీల తెలుగు నవల టైపు చేయడం అంటే నూతులో ఉన్న నీళ్లన్నీ గ్లాస్ తో తోడినట్టే.

పై రెండు విషయాలను గిన్నిస్ వారి పరిశీలనలో ఉన్నాయి. విజయవాడ కు చెందిన బహుబాషా కోవిదుడు పూలబాల భారతదేశం నుండి తొలి ఫ్రెంచ్ నవల వ్రాసి వార్తల్లోకెక్కారు.

SA:

View Comments (1)

  • పూలబాల గారు ఇంకా పెద్ద నవలలు రాసి మరింత ఖ్యాతి పొందాలని మనసారా కోరుకుంటున్నాను