
ఆంధ్ర సారస్వత పరషత్తు, ఆంధ్ర ప్రదేశ్ వారి ఆధ్వర్యంలో 3 వ ప్రపంచ తెలుగు మహా సభలు -2026 సందర్భంగా తెలుగు భాషా వికాసం పై అంతర్జాతీయ లఘు చలన చిత్ర పోటీలు.
చిత్ర ప్రదర్శన వేదిక 18 ఆగస్టు 2025, భారతీయ విద్యా భవన్ ప్రాంగణం, గుంటూరు, అమరావతి.
అంశం: తెలుగు భాష చారిత్రిక వైభవం, ఆంధ్ర సారస్వత దీప్తి, తెలుగు భాషా వికాసం, తెలుగు వెలుగులు, తెలుగు భాషా రక్షణ – ప్రాచుర్యం
నిడివి: 5 నిమిషాలు మాత్రమే. 4 నిమిషాలకు తక్కువగా వుండరాదు.
ఏ వయసు వారైనా పాల్గొనవచ్చు.
చిత్రాలు రాబోయే తరాల వారికి, తెలుగు జాతికి స్ఫూర్తి కల్గించే విధంగా వుండాలి. తెలుగు భాష రక్షణకు స్ఫూర్తి కల్గించాలి.
రాజకీయ పార్టీల అంశాలు, విద్వేషాలు కలిగించే అంశాలు వుండరాదు.
జాతీయ సమైక్యతకు భంగం వాటిల్లే అంశాలు వుండరాదు. ఒక సారి పంపిన ఎంట్రీ వెనక్కి తీసుకోవడానికి వీలు కాదు.
లఘు చిత్రం యొక్క క్వాలిటీ 720 / 1040 మెగాపిక్సెల్ వుండాలి.
ఎంట్రీలు జూలై 15 వ తారీఖు కు అందాలి.
ఎన్.ఓ.సీ. తప్పక ముఖ్య సాంకేతిక సభ్యుల నుండి ఇవ్వాలి.
ఒక సంస్థ రెండు ఎంట్రీల వరకూ ఇవ్వవచ్చు.
డాక్యుమెంటరీ, కథా పరమైన చిత్రాలు ఇందులో అనుమతించ బడతాయి.
బహుమతులు :
మొదటి బహుమతి – లక్ష రూపాయలు
ద్వితీయ బహుమతి – 75 వేల రూపాయలు
తృతీయ బహుమతి – 50 వేల రూపాయలు
మూడు ప్రశంసా బహుమతులు – ఒక్కొకరికీ 10,116 బహుమతులు.
ఉత్తమ నటుడు, నటి, ఉత్తమ రచన, ఉత్తమ ఛాయా గ్రాహకులకు వ్యక్తిగత బహుమతులు వుంటాయి.
విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు, అందజేయబడతాయి.
బహుమతి ప్రదానం 3 వ ప్రపంచ మహాసభలు గుంటూరు వేదికపైన 2026 జనవరి 3 వ తారీఖు జరుగుతుంది..
విజేతలయిన చిత్రాలు, ప్రదర్శనకు అర్హమైన చిత్రాలను ప్రపంచ తెలుగు మహా సభలలో ప్రదర్శిస్తాము.
ఫేస్ బుక్, యూ ట్యూబ్ లలో, ఇతర సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసుకోవడానికి ఆంధ్ర సారస్వత పరషత్తుకు సర్వహక్కులు వుంటాయి.
పోటీలో పాల్గొనే వారు నిర్వాహకులు ఇచ్చిన ఆన్లైన్ లింక్ లో చిత్రాలను అప్లోడ్ చేయాలి.
ఈ పోటీల కోసమే లఘు చలన చిత్రాలు నిర్మించబడి ఉండాలి.
ఈ పోటీలకు ముఖ్య సమన్వయకర్త గా ప్రముఖ నటులు, నిర్మాత, లోహిత్ కుమార్ 9849160141 వ్యవహరిస్తారు.
కార్యాలయం: ఆంధ్ర సారస్వత పరిషత్తు, తెలుగు మహా సభల కార్యాలయం, భారతీయ విద్యా భవన్, గుంటూరు. అమరావతి.
–కళాసాగర్