తెలుగు రచయిత్రుల మహాసభలు

ప్రపంచ తెలుగు రచయితల సంఘం – కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో…
యాభైయేళ్ళ క్రితం మచిలీపట్టణంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల మహాసభల నిర్వాహకులే 2019 జనవరిలో విజయవాడలో మరొకసారి ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల మహాసభలు ఘనంగా నిర్వహించిన సంగతి తమకు తెలిసినదే! మండలి వెంకటకృష్ణారావు శతజయంతి మహోత్సవాల సందర్భంగా ఇప్పుడు మరింత విస్తృతస్థాయిలో 2026 జూలై 11, 12 తేదీలలో తెలుగు రచయిత్రుల మహాసభలు విజయవాడలో నిర్వహించేందుకు ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కృష్ణాజిల్లా రచయితల సంఘం పక్షాన సన్నద్ధ మౌతున్నాం.
2,000 మిలీనియానికి ఈ మహాసభలు రజతోత్సవ కానుక. గత పాతికేళ్ళ సాహిత్య ప్రగతి సమీక్షతో పాటు, రాబోయే పాతిక సంవత్సరాలలో తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతుల అభ్యున్నతికి రచయిత్రుల పాత్ర గురించి విశేషించిన చర్చలకు ఈ మహాసభలు వేదిక కానున్నాయి.

వివిధ అంశాలపై, సదస్సులు, కవయిత్రుల కవిసమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతుల కోసం ఇతోధికంగా పాటుపడిన విదుషీమణులకు గౌరవ సత్కారాలతో పాటు, ప్రతి యేటా కృష్ణాజిల్లా రచయితల సంఘం అందించే ప్రతిభాపురస్కారాలను ఈ మహాసభలలో అందించి గౌరవించనున్నాము.

పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాము. వివిధ మహిళా సంఘాల సహకారాన్ని ఇందుకు అభ్యర్థిస్తున్నాము. మీ సలహాలు, సూచనలకు ఆహ్వానం. ఈ పిలుపుకు ప్రతిస్పందించిన రచయిత్రు లందరికీ ఈ తెలుగు రచయిత్రుల మహాసభలలో సముచిత స్థానం ఉంటుందని మనవి. రచయిత్రులు, ఉద్యోగినులు, ఉపాధ్యాయినులు, వివిధ సంఘాలలో ముఖ్య పాత్ర వహిస్తున్న, సామాజిక చైతన్యం కలిగిన మహిళ లందరికీ ఈ ఆహ్వానం చేరేలా సహకరించ వలసిందిగా ప్రార్థన.

గుత్తికొండ సుబ్బారావు, అధ్యక్షులు, 9440167697,
జి.వి. పూర్ణచందు, ప్రధాన కార్యదర్శి, 9440172642,
దామెర్ల నరసింహారావు, కోశాధికారి, 9885660972,
భవిష్య సంధానకర్త, 9247111696

సమావేశకర్తలు:
తేళ్ళ అరుణ, 8466908888,
కరెడ్ల సుశీల, 9440330500
పుట్టి నాగలక్ష్మి, 9849454660,
గంగరాజు అరుణాదేవి, 9493485818
సిరిపురపు అన్నపూర్ణ, 9247346614

Share via
Copy link
Powered by Social Snap