“కళాయజ్ఞ-జీవన రేఖలు” అవసరమైన సృజనాత్మక టానిక్

తిరుపతి నగరంలో కళని, కళా సంస్కృతిని పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో శ్రీ కళాక్షేత్ర తిరుపతి బాలోత్సవం, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళాయజ్ఞ – జీవన రేఖలు మోనోక్రోమాటిక్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ ని ఆదివారం ఉదయం ముఖ్య అతిథిగా విచ్చేసిన రీచ్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ రమేష నాథ్ రింగుట్ల లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. కళాకారులు అజరామరమని కళ శాశ్వతమని…కళాకారుల‌ కృషిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా హాజరైన ప్రముఖ చిత్రకారులు శేషబ్రహ్మం మాట్లాడుతూ కళాకారులకు మంచి ప్రాక్టీస్ గా ఉంటుందని తద్వారా వారు చక్కని చిత్రాలు గీయటానికి దోహదపడుతుందని లక్ష్యంతో 21 రోజులపాటు రోజుకి ఒక కాన్సెప్ట్ తో కళాయజ్ఞ కార్యక్రమం నిర్వహించామన్నారు. అనంతరం ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ కన్వీనర్ సునీల్ కుమార్ అనుమకొండ మాట్లాడుతూ తిరుపతి నగరం మరియు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన స్పందన అమోఘమని గతంలో విజయవాడ, వైజాగ్ నగరాలలో నిర్వహించిన దానికంటే మూడు రెట్లు స్పందన రావటం ముందు తరాల వారి కళాభివృద్దికి దోహదపడుతుందని అన్నారు.

మధ్యాహ్నం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకటేశ్వర యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్: కిరణ్ కాంత్ చౌదరి శనివారం కళాయజ్ఞ ఆర్ట్ కాంటెస్ట్ లో పాల్గొన్న చిన్నారులను వారిని ప్రోత్సహిస్తూ తీసుకువచ్చిన వారి తల్లిదండ్రుల కృషిని ఆయన అభినందించారు. అలాగే “కళాయజ్ఞ – జీవన రేఖలు” మోనోక్రోమాటిక్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న చిత్రకారుల కళా నైపుణ్యాన్ని ఆయన కొనియాడారు.

అనంతరం ఆర్ట్ కాంటెస్ట్ లో పాల్గొన్న చిన్నారులందరికీ ప్రసంశా పత్రాలు, గెలుపొందిన విజేతలకు ప్రసంశా పత్రాలు, ప్రత్యేక జ్ఞాపికలను అందజేసారు.

ఈ కార్యక్రమాన్ని ప్రముఖ చిత్రకారులు శేషబ్రహ్మం, పల్లారపు నాగార్జున, టెంకాయల దామోదరం, నడ్డి నారాయణ, ఎస్. రెడ్డప్ప, గురునాథం, ముకేష్, జి.మురళి, సుజాత, ముని లక్ష్మి, తహస్సున్నిసా, ఓ.వి.రమణ, గిన్నె సాగర్, ఆనంద్, లావణ్య, దివ్య, హేమప్రియ, రత్నశేఖర్, విజయవాడ ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ టీం మెంబెర్స్ గిరిధర్ అరసవల్లి, స్ఫూర్తి శ్రీనివాస్, ఎస్.పి.మల్లిక్ లు పర్యవేక్షించగా పలువురు కళాకారులు, కళా ప్రేమికులు పాల్గొన్నారు.

SA:

View Comments (1)