టాప్ యూట్యూబర్స్ కు శతపత్రసమ్మానం

ఈ మధ్య కాలంలో అత్యంత ఆదరణ పొందిన ఎలక్ట్రానిక్ మాధ్యమం ఏదన్నా ఉందంటే అది “యూట్యూబ్!” ఇందులో రాణించాలనుకున్న వారికి ప్రోత్సాహకరంగా, కొత్తగా ప్రవేశించాలనుకునే వారికి స్పూర్తిగా నిలుస్తుందని ఆకాంక్షిచిన కళాసాగర్ గారు ఓ నూతన పుస్తకాన్ని వెలువరించారు. 12 ఏళ్ళుగా 64కళలు.కామ్ వెబ్ మ్యాగజైనుకు సంపాదకులుగా బాధ్యత నిర్వహిస్తూ ఉత్తమోత్తమ లక్ష్యాలతో కార్యసాధకుడిగా తన కళారచనల ప్రస్థానాన్ని సుదీర్ఘంగా కొనసాగిస్తున్నారు. మొన్న “కొంటె బొమ్మల బ్రహ్మలు”… ఇప్పుడు మరో నూతన విషయంమైన “టాప్ 100 యూట్యూబర్స్ ఇన్ తెలుగు” అన్న నూతన గ్రంథాన్ని ఆవిష్కరించారు. యూట్యూబ్ మాధ్యమం ద్వారా బహుళ ప్రజాదరణ పొందిన… సామాన్యుని మాన్యుని చేసిన వంద ఛానల్స్ పై దృష్టి సారించారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి సమూహంలోనూ ఒకరిద్దరు యూట్యూబర్స్ ఉండటం, మాఛానల్ని సబ్ స్ర్కైబ్ చేయమని అడగటమూ మనం గమనించివుంటాము. మనం నిత్యం వీక్షించే చానళ్ళు ఎంత ప్రాచుర్యం పొందినవో మనమంతగా దృష్టి సారించం. ఈ పుస్తకం ద్వారా తెలిసి ఆశ్చర్యపోకతప్పదు. ఈ సోషల్ మాధ్యమం గురించి క్షుణ్ణంగా పుస్తకం తీసుకురావటం అభినందనీయం. తెలుగు పాఠకునికి తొలిపరిచయంగా ఈ పుస్తకం రావటం ఓ ఎత్తయితే తద్వారా ఆ వంద మంది యూట్యూబర్స్ “తెలుగు తేజాలు” అన్న బిరుదునందుకున్న వారయ్యారు.

యూట్యూబ్ ఎప్పుడు పుట్టింది? యూట్యూబ్ అవార్డుల ఎవరికి లభిస్తాయి?… నూతనంగా చానల్ ప్రారంభించాలనుకున్న ఔత్సాహికుల మొదలు… చానల్ ను నడుపుతున్న వారి వరకూ తెలుసుకోవలసిన విషయాలు ఈ 100 పేజీల(అట్టలతో కలిపి) పుస్తకంలో సమగ్ర సమాచారం దొరుకుతుంది.

2006లో ఛానల్ ను ప్రారంభించిన ఒక సీనియర్ యూట్యూబర్ గా నల్లమోతు శ్రీధర్ గారు ఈ పుస్తకానికి ముందుమాట అందివవ్వటం ఇందులోని విషయాలకు సాధికారత లభించింది. యూట్యూబర్స్ కే తెలియని కొత్త విషయాలతోపాటు, ఇదో కళగా శ్రీధర్ గారు ప్రస్తావించారు. యూట్యూబ్ ను గూగుల్ కొనుగోలు చేసేనాటికి తెలుగులో వేళ్ళమీద లెక్కించదగ్గ చానల్స్ 10 మాత్రమే ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య వేలల్లోకి చేరిపోయాయని అభిప్రాయ పడ్డారు. యూట్యూబర్సును మూడు వర్గాలుగా వర్గీకరించి చెప్పిన విషయాలు, ప్రతి యూట్యూబరు తెలుసుకోవాల్సి ఉంది. ప్రేక్షకుని సమయం అత్యంత విలువైనదిగా వారు చెపుతారు. యూట్యూబ్ డబ్బు, పేరుకు మాత్రమే కాదు విలువలకు ప్రాధాన్యత తప్పని సరిగా ఇవ్వాలంటారు.

అంచెలంచెలుగా ఎదుగుతూ టాప్ యూట్యూబర్లుగా శిఖరాగ్రానికి చేరుకున్న వారి రచయిత సేకరించిన వివరాలను సంక్షిప్తంగా సంకలనం చేయటమేకాక, అక్కడే క్యూఆర్ కోడ్ క్రియేట్ చేసి ఇవ్వటం వలన చిటికలో స్కాన్ చేసి ఆ ఛానల్ ను చేరుకునే సౌలభ్యాన్ని కల్పించారు. కళాసాగర్ గారి ఈ సూక్ష్మప్రయత్నం వారిలోని సాంకేతిక స్పూర్తికి దర్పణంపడుతుంది.. ఉన్నత విలువలును నిర్దేశించుకుని వాటికి తగ్గట్లు అరుదైన ప్రతిభాపాటవాలను గుర్తించి ప్రోత్సహించే దృక్పథం కలిగిన సాగర్ గారు ఎంతో శ్రమించి అందించిన పుస్తకం ఈ “టాప్ 100 యూట్యూబర్స్ ఇన్ తెలుగు”.

చానల్లో విజ్ఞానం, వినోదం, ఆరోగ్యం వంటలు పంటలు మొక్కల పెంపకం చిత్రలేఖనం సంగీతం పాటలు జ్యోతిష్యం అంటూ… శీర్షికలవారీగా వర్గీకరించి ఇవ్వటంవలన పాఠకులు తమకు కావలసిన ఛానల్ ను వెతకకుండానే సుళువుగా చేరే మార్గాన్ని చూపారు. గూగుల్ ఒక సెర్చ్ ఇంజన్ గా విజువల్ – వెర్బల్ మాధ్యమం మాత్రమే అయితే, యూట్యూబ్ గూగుల్ కు దృశ్యచలన మాధ్యమంగా మరింత బలాన్ని ఇస్తుంది.

ఒక యూట్యూబర్ గా నేను ఈ పుస్తకాన్ని పరిశీలించాక ఎన్నో కొత్త విషయాలపై మరింత లోతైన అవగాహనను పెంచుకున్నాను. పుస్తకంలోని ప్రతి పేజీని అలంకరించిన తీరు ఎంతో శాస్త్రీయంగా ఉంది. ఈ పుస్తకంలో అక్కడక్కడ చొప్పించిన స్పేస్ ఫిల్లర్స్ లో “మీకు తెలుసా” అన్న శీర్షికన ఇచ్చిన సమాచారం తప్పక ఆశ్చర్య పరుస్తుంది. ఇంతటి కృషికి కారణభూతులైన రచయిత కళాసాగర్ గారిని తప్పక అభినందించాలి.

-ఆత్మకూరు రామకృష్ణ

ప్రతులకు: కళాసాగర్, రచయిత (9885289995)
పేజీలు: 96, వెల: 120/-


1 thought on “టాప్ యూట్యూబర్స్ కు శతపత్రసమ్మానం

  1. మీ పుస్తకం గురించి చదివాను sir, ముందు మాట చాలా బాగుంది, కొత్తగా youtube channel పెట్టేవారికి ఎంతగానో ఉపకరిస్తుంది. పుస్తక రూపంలో ప్రచురించిన మీ కృషికి మా ధన్యవాదములు sir.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap