
గుగూల్ తర్వాత పాపులర్ సెర్చ్ ఇంజన్ యూట్యూబ్. దాదాపు 15 ఏళ్ళ క్రితం చిన్న స్టార్ మొదలైన యూట్యూబ్ ఈ రోజు ప్రపంచాన్ని ఎలా? శాసిస్తోందో మనందరం చూస్తూన్నాం. గత 15 ఏళ్ళుగా ఎన్నో కోట్ల ఛానల్స్ పుట్టుకొస్తున్నాయి. ఎంతో మందికి పేరు తెచ్చి పెట్టింది. మరికొంతమందికి డబ్బులిస్తుంది…. ఎంతో మందికి ఉపాధి కల్పింస్తుంది. ఎంతో మందిని స్టార్స్ ని చేసింది. కొంతమంది స్టార్స్ ని కూడా యూట్యూబర్స్ ని చేసింది.
తమ ప్రతిభను, అభిరుచులను అందులో తమకున్న అనుభవాలను వీడియోలుగా రూపొందించి యూట్యూబ్ ద్వారా వారికున్న ప్రతిభాపాఠవాలను యావత్ ప్రపంచానికి తెలియజేస్తూ తద్వారా వేల నుండి లక్షలవరకు సంపాదిస్తున్న తెలుగు యూట్యూబర్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సృజనాత్మకంగా ఆలోచించాలే కాని ఉపాధికి కాదేది అనర్హం అంటున్నారు నేటితరం. ఒకప్పుడు ఉద్యోగం అంటే ఎవరో ఇవ్వాలి అనేవారు, కాని, నేడు తమ అభిరుచులే ఉపాధిగా వారే సృష్టించుకుంటున్నారు. టెక్నాలజీ పైన అవగాహన పెంచుకొని, అభిరుచికి సృజననల జతచేసి యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాలు వేదికగా మార్చుకుంటున్నారు.
ఈ ఛానలో విజ్ఞానం, వినోదం, ఆరోగ్యం, వంటలు, మొక్కల పెంపకం, సంగీతం, గానం, సాహిత్యం, జ్యోతిష్యం, వాస్తులతో పాటు టెక్నాలజీ, వార్తలు – విశ్లేషణలు, విహారయాత్రలు, షార్ట్ ఫిలింలు, సరదా కబుర్లు ఇలా ఒకటేమిటి సకల కళల సమాహారం యూట్యూబ్.
వినోదానికి – విజ్ఞానానికి – కాలక్షేపానికి 90వదరకం వరకూ మెగజైన్లు పుస్తకాలకు మించిన సాధనం మరొకటి లేదు. సినిమాలు తర్వాత గత దశాబ్దంలో టీవి వాటి స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం సోషల్ మీడియా ఫేస్ బుక్, వాట్స్ యాప్, యూట్యూబ్ వచ్చి పుస్తకాలు, పత్రికలు, సినిమాలు, టీవీలను మరచిపోయాలా చేసాయి. దీనికి ముఖ్యకారణం 3 మొబైల్ ఫోన్స్. జియో లాంటి సంస్థలు డేటాను అతి తక్కువ ధరకు అందించబడంతో కోట్లాదిమంది మొబైల్ యూజర్స్ తమ ఫోన్లలోనే సినిమాలు, షార్ట్ ఫిల్మ్ లు, టీవీ కార్యక్రమాలు, టిక్-టాలు చూస్తున్నారు. యూట్యూబ్ ప్రవేశంతో ఎన్నో కొత్త యూట్యూబ్ ఛానల్లు, పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.
అతి తక్కువ ఖర్చులో, కేవలం ఒకరిద్దరు వ్యక్తులు నిర్వహించగలిగే తెలుగు ఛానల్స్ నేడు వేలాదిగా అందుబాటులో వున్నాయి. ప్రతిభ వుండాలేగానీ ఆకాశమే హద్దుగా అవకాశాలు సోషల్ మీడియాలో ఎన్నో…
య్యూటూబ్ లో తెలుగు – తేజాలు పేరుతో వారం వారం ఒక్కో రంగానికి చెందిన య్యూటూబర్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా మనకు అతిముఖ్యమైన ఆహారం-వంటలు, ఆరోగ్యంకు సంబంధించిన ఛానల్స్ నిర్వహిస్తున్న వారి గురించి తెలుసుకుందాం.
-కళాసాగర్ యల్లపు

VISMAI FOOD
గుంటూరు జిల్లాకు చెందిన తేజ పరుచూరి హైదరాబాద్ సినీరంగంలో అసిస్టెంట్ డైరెక్టరుగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేస్తూ వాళ్ళబ్బాయి విస్మయి పేరుతో వంటల ఛానల్ ప్రారంభించారు. 2016లో ప్రారంభించిన ఛానలకు నాలుగేళ్ళలో 19 లక్షల చందాదారులతో దూసుకుపోతున్న వీరికి సుమారు ఎనిమిది మంది టీం వుంది. వీరు డైలీ షూటింగ్ చేయకుండా ఒకేసారి 10 -15 రకాల వంటకాలు షూట్ చేసి, వాటిని పోస్టు చేస్తూంటారు. ఇతని వీడియోల్లో ప్రత్యేకత ఏమిటంటే కేవలం 3-4 నిమిషాల్లో ఆయా వంటకం వండే విధానం చక్కగా చెప్తారు. ఏ వీడియోలోను ఈయన కనిపించరు. కేవలం తన గొంతును వినిపిస్తారు. వీరికి నెలకు 4 నుండి 6 లక్షల వరకు ఆదాయం వస్తుంది.
https://www.youtube.com/watch?v=2ZwYUqf77Yw

SRAVANI’s KITCHEN
హైదరాబాద్కు చెందిన గూడా శ్రావణి డిగ్రీ చదువకున్న ఓ గృహిణి. ఆంధ్రా, తెలంగాణా, రాయలసీమ, సౌత్ – నార్త్ ఇండియా వంటకాలు చేయడంలో నేర్పరి. వివిధ రకాల వంటకాలు – అవి చేసే విధానం సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెబుతారు. ‘శ్రావణి కిచెన్’ ఛానల్ లో ముఖ్యంగా ఎన్నో వెరైటీల పిండివంటలు చేయడం వీరి ప్రత్యేకత. అందుకే ఛానల్ ప్రారంభించిన నాలుగేళ్ళకే 18 లక్షల మంది చందాదారులతో తెలుగు యూట్యూబర్స్ లో అగ్రభాగాన వున్నారు శ్రావణి. 10 లక్షల చందాదారులున్న వారికిచ్చే ‘గోల్డ్ బటన్’ కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఈ ఛానల్ ఆదాయం లక్షల్లోనే వుంది.
https://www.youtube.com/watch?v=4Hlc5aP6UEQ

JANU’S KITCHEN ART AND CRAFT
ప్రకాశం జిల్లా కనిగిరి కి చెందిన ఉషారాణిగారు డిగ్రీ పూర్తిచేసారు. యువతులకు, గృహిణులకు ఉపయోగపడే విధంగా ఏదయినా చేయాలన్న ఆలోచనతో తనకొచ్చిన వంటలను, కుట్టుపనులను ఇతరులు నేర్చుకొనే విధంగా వీడియోలు చేసి, ‘జాను కిచెన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ‘ ఛానలను 2017లో ప్రారంభించారు. ఇందులో వివిధ రకాల వంటలు, మగ్గం వర్కు శారీ డిజైనింగ్, క్లౌజ్ డిజైనింగ్, మేకప్లో మెళకువలు గురించి వివరిస్తారు. ఆర్ట్ అండ్ క్రాఫ్త్స్ తో పాటు పిల్లలకోసం బొమ్మలు ఎలా తయారు చెయ్యాలో వివరిస్తారు. ప్రారంభించిన మూడేళ్ళలో రెండు లక్షల 40 వేలకు పైగా చందాదారులను కలిగి వున్నారు.
https://www.youtube.com/watch?v=WSVRfEqprpA

WONDERFUL WOMEN
రాజమండ్రికి చెందిన గ్రంధి శిరీష గోదావరి జిల్లాల సాంప్రదాయ వంటలు, ఆధునిక ఆహారపు అలవాట్లు, ఫ్యాషన్, మేకప్, హెయిర్ స్టైల్ లాంటి ఆడవారికి ఉపయోగపడే అనేక అంశాలను ఆకట్టుకునే విధంగా వివరిస్తారు. ప్రారంభించిన మూడేళ్ళకే మూడు లక్షలకు పైగా చందాదారులను పొందడం ఈమె విజయానికి చిహ్నం.
https://www.youtube.com/watch?v=ONv9aqQp-q8
AMMA CHETI VANTA
రాజమండ్రికి చెందిన ఆవుల భార్గవి బి.యస్సీ. చదువుకొంది, పెళ్లి తర్వాత భర్త ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటుంది. తన తల్లి సలహామేరకు ‘అమ్మచేతి వంట’ ఛానల్ ను 2017లో ప్రారంభించింది. రుచికరమైన అన్నిరకాల ఆంధ్రా వంటలతో పాటు, వంటింటి చిట్కాలు, ఫ్యాషన్, ట్రావెలింగ్ వీడియోలు చేస్తారు. చక్కటి తెలుగులో ఆకట్టుకునే ఆహార్యంతో తన కొంతకాలం ఐఫోన్లోను, ప్రస్తుతం వీడియో కెమెరాలోను షూట్ చేసి, తనే ఎడిట్ చేసుకుంటారు. రోజుకొక వీడియో పెడుతూ క్వాలిటీ కంటెను అందిస్తున్నారు. ‘గోల్డ్ బటన్’ అందుకున్న వీరి ఛానల్ కు ప్రస్తుతం 14 లక్షల చందాదారులున్నారు. యూట్యూబ్ నుండి అందుకున్న మొదటి పేమెంట్ రూ. 12000/-, మరి ఇప్పుడో … మీరే వూహించుకొండి.
https://www.youtube.com/watch?v=LxY2oVADrG4


RENUKA THOKA
రేణుక తోక గారు తన పేరుతోనే 2015లో ప్రారంభించిన ఈ ఛానల్ లో వెజిటేరియన్ మరియు నాన్ వెజ్ వంటలతో పాటు స్నాక్స్, డ్రింక్స్, పిండి వంటలు, కూరలు, టిఫిన్, పండుగల ప్రత్యేక వంటకాల గురించి వందలాది వీడియోలు చేసారు. తన రెసిపిలలో ఎవరికైనా సందేహాలుంటే కామెంట్ బాక్స్ లో అడిగిన వారందరికి ఎంతో ఓర్పుతో సమాధానాలు ఇస్తారు రేణుక. చేసిన వీడియోలన్నీ అందరికీ నచ్చవని, కొన్ని మాత్రమే వైరల్ అవుతాయని రేణుక చెబుతారు. పదిలక్షల చందాదారులకు చేరువలో వున్న రేణుక గారు త్వరలో ‘గోల్డ్ బటన్’ అందుకోనున్నారు. ప్రస్తుతం ఈ ఛానల్ ఆదాయం లక్షల్లోనే వుంది….
https://www.youtube.com/watch?v=tB1AmybQoFc

KALAGURA GAMPA
ఎమ్మెస్సీ పూర్తిచేసిన ‘పటోళ్ళ శ్రీదేవి’ గారు ‘కలగూర గంప ‘ పలకరింపు – ప్రతి రోజు ఛానల్ లో వంటలు, పచ్చళ్ళు, ఇంటీరియర్, ఆరోగ్యం , ఇంటి ఆవరణలో మొక్కల పెంపకం, పండుగలు, పుస్తకాలు, ఫ్యామిలీ, రిలేషన్స్ తో పాటు అనేక సామాజిక అంశాలను జోడించి వీడియోలు చేస్తారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీదేవిగారు తెలంగాణా వంటకాలు, పచ్చళ్ళు , చేయడంలోనే కాదు, తెలంగాణా మాండలికంతో కమ్మనైన తెలుగును వినిపిస్తారు. వీరు చేసిన వాటిలో సంవత్సరం పాటు నిల్వవుండే నీళ్ళతో ఆవకాయ పచ్చడి చాలా పాపులర్ అయ్యింది. 5 ఏళ్ళ క్రితం ప్రారంభించిన వీరి ఛానల్ కు 2 లక్షల 18 వేల మంది చందాదారులున్నారు. ‘kalaguragampa.com ‘ వెబ్సైట్ ద్వారా ఆరోగ్యకరమైన ప్రోడక్ట్స్ ను, వివిధ రకాల విత్తనాలను విక్రయిస్తున్నారు.
https://www.youtube.com/watch?v=lWl6Pk94kEU

SMART TELUGU HOUSE WIFE
కొన్ని ఛానల్ కు విచిత్ర మైన పేర్లు పెడుతున్నారు క్రియేటర్స్. అలాంటి వాటిలో ‘స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ‘ ఛానల్ ఒకటి. బి.యస్సీ. కంప్యూటర్ చదువుకొన్న హైదరాబాద్ కు చెందిన మోర్ల స్వప్న తన డైలీ లైఫ్ ని, రుచికరమైన వంటలను, బ్యూటీ, హెల్త్ టిప్స్ వీడియో లను పెట్టేందుకు రెండేళ్ళ క్రితం ప్రారంభించారు ఈ ఛానల్ ను. రోజుకొక వీడియోను అప్లోడ్ చేసి ప్రస్తుతం 3 లక్షల 70 వేల చందాదారులను కల్గివున్నారు.
https://www.youtube.com/watch?v=j3oODdb1R-c

PATNAM LO PALLETURU
కృష్ణా జిల్లా, గన్నవరం కు చెందిన పిన్నాక పద్మగారు హైదరాబాద్ లో నివాసం వుంటున్నారు. తన ‘పట్నంలో పల్లెటూరు’ ఛానల్ లో మొక్కల పెంపకం, వంటలు, కాయగూరలు పండించడం తదితర అంశాలను ఎంతో ఆశక్తిగా, సవివరంగా చెప్తారు. వీరు ఛానల్ ప్రారంభించిన సంవత్సరంలోనే 2 లక్షల 35వేల మంది చందాదారులను క్రాస్ చేసి సిల్వర్ బటన్ సాధించారు. మొక్కల పెంపకంపై ఆశక్తి వున్నవారికి ఈ ఛానల్ బాగా వుపయోగపడుతుంది. మిద్దె తోట పెంపకం వీరి ప్రత్యేకత. వీడియో ఎడిటింగ్ వీరి పిల్లలు చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు.
https://www.youtube.com/watch?v=LAsKj80zQ_4

AMERIKA LO AMMA KUTTI
తెలంగాణా కు చెందిన కళ్యాణి బొప్పా బి.టెక్. చేసి పెళ్ళి తర్వాత అమెరికాలో అడుగు పెట్టింది. ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ వుద్యోగం చేస్తూ అమెరికాలో అమ్మకుట్టి పేరుతో ఛానల్ ప్రారంభించింది. తనకు తెలిసిన, చూసిన అమెరికాను మనవాళ్ళకు వివరిస్తూ… అక్కడి జీవనవిధానం, చదువులు, షాపింగ్లు, పండుగలు, వంటలు లాంటి అనేక అంశాల గురించి వీడియోలు చేస్తున్నారు. 2019లో ఛానల్ ప్రారంభించిన కళ్యాణి కి లక్షా యాభై వేలమంది చందాదారులున్నారు.
https://www.youtube.com/watch?v=IeJU7v0hjQY

RAASI VISIONS
అచ్చ తెలుగు సినీ కథానాయక రాసి పెళ్ళి తర్వాత సినిమాలకు దూరంగా వుంటుంది. లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమ్మైన రాసి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో ‘రాసి విజన్స్ ‘ పేరుతో ఛానల్ ను ప్రారంభించింది. ఇందులో రకరకాల వంటలు, బ్యూటీ టిప్స్ తో పాటు సినిమా కబుర్లు కూడా షేర్ చేస్తుంది. ఛానల్ ప్రారంభించిన ఆరు నెలల్లోనే లక్ష చందాదారులను క్రాస్ చేసి ‘సిల్వర్ బటన్ ‘ అందుకున్నారు.
https://www.youtube.com/watch?v=kBkqjhfTc-E

MAD GARDENER
విశాఖపట్నానికి చెందిన మాధవి గుత్తికొండ గృహిణి. గార్డెనింగ్ పై ఆశక్తితో ఇంటిపైన ఎన్నో రకాల మొక్కలు పెంచుతున్నారు. 2018లో మేడ్ గార్డెనర్ పేరుతో ఛానల్ ప్రారంభించారు. వివిధ రకాల మొక్కల పెంపకం, కూరగాయలు పండించడం తో పాటు రకరకాల వంటల గురించి వీడియోలు చేస్తారు. రెండేళ్ళలో 3 లక్షల 80 వేల మంది చందాదారులను కల్గివున్నారు. కిచెన్ గార్డెనింగ్, కంటైనర్ గార్డెనింగ్, టెర్రస్ గార్డెనింగ్ వీరి ప్రత్యేకత.
https://www.youtube.com/watch?v=2Fpw8baK3eg
Suneetha Chowdhary
విశాఖపట్నానికి చెందిన సునీత చౌదరి కి రుచికరమైన రకరకాల వంటలు చేయడం హాబీ. యూట్యూబ్ లో చాలా ముందుగానే ఛానల్ ప్రారంభించిన వారిలో సునీత గారొకరు. 2011 లో ప్రారంభించిన సునీత చౌదరి ఛానల్ కి ప్రస్తుతం 5 లక్షలు చందాదారులున్నారు. ఇంకో ముఖ్యవిశేషం ఏమిటంటే ఇప్పటి వరకు 680 వీడియోలు చేసినా, ఏ వీడియో లోనూ వీరు కనిపించరు. కేవలం మాటలు తోనే రెసిపీ వివరిస్తారు.
https://www.youtube.com/watch?v=dDP3newOjGw

Lalitha’s Kitchen Tips
టమాట రసం తయారి విధానాన్ని వివరిస్తూ లలిత చేసిన వీడియోకు 10 లక్షల వీక్షకులు పైగా చూసారంటే ఈవిడ రెసిపీ కి వున్న రుచి ఏపాటిదో అర్థంచేసుకొవచ్చు. 2018 లో ప్రారంభించిన లలిత కిచెన్ ఛానల్ కి ప్రస్తుతం 3 లక్షల 87 వేల చందాదారులున్నారు.
https://www.youtube.com/watch?v=2g8VV3S_l_U

ISMART GOWTHAMI
విజయవాడకి చెందిన తాల్లూరు గౌతమి గృహిణి. బయోటెక్నాలజిలో ఎం.టెక్. చేసింది. ఇద్దరు పిల్లలు. ఉద్యోగం చేయాలంటే వీలుపడదు కాబట్టి ఇంట్లో వుండే ఏదయినా చేయాలన్న ఆలోచనతో ‘ఇస్మార్ట్ గౌతమి ‘ పేరుతో ఛానల్ ప్రారంభించి వంటలు, బ్యూటీ, హెల్త్ టిప్స్, గార్డెనింగ్, వ్లొగ్స్ తదితర అంశాలను చక్కగా వివరిస్తూ వీడియోలు చేస్తున్నారు. వీడియో షూటింగ్, ఎడిటింగ్ తనే సొంతంగా చేయడం యూట్యూబ్ లో చూసి నేర్చుకొన్నారు. ఛానల్ ప్రారంభించిన సంవత్సరంలోనే 2 లక్షల 65 వేల మంది చందాదారులను పొందడం విశేషం. సినీ దర్శకుడు రాఘవేంద్ర రావు గారు కూడా మెచ్చుకున్న ఛానల్ ‘ఇస్మార్ట్ గౌతమి ‘.
ఇంకా అనేకమంది లక్ష కు పైగా చందాదారులను కలిగివున్నవారున్నారు. మరి కొన్ని ఛానల్ పేర్లు, లింక్లు ఇక్కడ చూడండి….
Telugu Housewife- https://www.youtube.com/watch?v=s6Yt6BpscLk
Grandpa Kitchen https://www.youtube.com/watch?v=fizbbn7Kvzc
Heavenly Home made – https://www.youtube.com/watch?v=KUoUpF9yrPI
Radha Telugu Channel – https://www.youtube.com/watch?v=K9zclS0y4Zg&t=325s
Swathi Agriculture – https://www.youtube.com/watch?v=Sop8NRQFKTQ
Cherry Sathakshi – https://www.youtube.com/watch?v=pRbUpiPPd64
Homely Thoughts – https://www.youtube.com/watch?v=WDBCP2EjftQ
Telugu Health and Beauty – https://www.youtube.com/watch?v=dy1BOjCb_w4
Peravali Sisters The Telugu Vloggers – https://www.youtube.com/watch?v=sPPLWWU4OcU
Telugu Hyderabadi Homemaker Gayathri – https://www.youtube.com/watch?v=gPfl9oCc2FE
B Like BINDU – https://www.youtube.com/watch?v=mIuO_2riwuE
sravs beauty&home – https://www.youtube.com/watch?v=zTnq9f6ifQg
Godavari Ruchulu By Surekha – https://www.youtube.com/watch?v=e1yrz7xe72g
మరికొంతమంది య్యూటూబర్స్ గురించి వచ్చే వారం తెలుసుకుందాం …
Wow..ఆసక్తికరంగా ఉంది 👌
Thanks Kalasagar garu !!
Chala baga vivarinacharu anni channels gurunchi. shravani’s kicthen channel gurunchi vivarinchinanduku santosham ga undi andi !!
best wishes for your articles !!
చాలా థాంక్స్ అండి.
మీ పత్రికలో స్మార్ట్ తెలుగు హౌస్వైఫ్ ఛానల్ గురించి వివరించినందుకు ధన్యవాదాలు.
ఇలా మీరు మరిన్ని ఆర్టికల్స్ పబ్లిష్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Thank you so much for your recognition.
I am very happy by seeing this post. This type of recognition will boost our energy level and encourage us to do better.
Once again Thank you.
G SIREESHA
Thank you so much mentioned my Channel.
Madhavi Guttikonda
చాలా బాగుంది కళాసాగర్ గారు ఈ ఆర్టికల్. చాలా మంది యూట్యూబ్ చానల్ వాళ్ల వివరాలు ఇచ్చారు. నా చానల్ గురించిన వివరాలు కూడా ఇస్తారు అని ఆశిస్తున్నాను
Thank you so much andi…
మీ ఆర్టికల్ లో lalitha’s kitchen Tips ఛానల్ గురించి ప్రస్తావించినందుకు చాలా సంతోషం అండి….
Best wishes sir……
Lalitha Kitchen Tips
I love all YouTube bloggers recipe, they are so easily made and nice for everyone 🙂
I’m really happy to express my opinions here! 🌖 This content is refreshing because it skillfully combines knowledge and creativity in a way that is both fascinating and educational. Everything appears to have been assembled with care.
https://hennaveda.com/