“దుర్గి స్టోన్ కార్వింగ్” కు పర్యాటక శాఖ అవార్డు

(దుర్గి స్టోన్ కార్వింగ్ కు ఆర్ట్ మరియు కల్చర్ ద్వారా టూరిజం అభివృద్ధి విభాగంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ద్వారా అవార్డు)
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ రోజు(సెప్టెంబర్ 27) ఉదయం విజయవాడ, తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఏ.పి. టూరిజం డెవలప్మెంట్ కార్పరేషన్ అధ్వర్యంలో టూరిజం రంగ అభివృద్ధికి కృషి చేస్తున్న పలువురిని సత్కరించారు. పర్యాటక రంగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చే వారికి ఇచ్చే పురస్కారాల్లో ‘దుర్గి స్టోన్ కార్వింగ్ కు ఆర్ట్ మరియు కల్చర్ ద్వారా టూరిజం అభివృద్ధి’విభాగంలో అవార్డును బహుకరించటం జరిగినది. ఈ అవార్డును పర్యాటక శాఖ మంత్రి రోజా గారి చేతుల మీదుగా పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ గారు, పర్యాటక అభివృద్ధి సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కన్నబాబు గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో N.T.R. జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిల్పి చెన్నుపాటి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ “ఈ అవార్డును అందజేసినందుకు పర్యాటక శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని భవిష్యత్తులో స్టోన్ కార్వింగ్ పరిశ్రమను మరింత అభివృద్ధి చేసి అనేక రకాల శిల్పాలను పర్యాటకలకు అందుబాటులో ఉంచుతామని తెలియజేశారు”.
ఈ అవార్డులు అందుకున్న వారిలో ప్రముఖ హొటల్స్ యజమానులు, ట్రావల్ ఏజన్సీలు, జర్నలిస్టులు ఉన్నారు.

SA: