“డెక్కన్ క్రానికల్ “లో కార్టూన్లు గీశాను- టి.ఆర్. బాబు

నా పేరు తోట రాజేంద్ర బాబు. టి.ఆర్.బాబు పేరుతో 1980 నుండి కార్టూన్స్ వేస్తున్నాను. పుట్టింది 1959 లో ఏప్రిల్ 7న, విశాఖపట్నం లో. నామొదటి కార్టూన్ 1980 లో బుజ్జాయి మాసపత్రికలో ప్రచురితమైనది. విశాఖ స్టీల్ ప్లాంటులో సీనియర్ ఫోర్మన్ గా 2019 లో పదవీ విరమణ చేశాను. ప్రస్తుతం విశాఖపట్టణంలో నివాసం వుంటున్నాను.

చదువుకునే రోజుల్లో నాకు బొమ్మలు వేయటం రాదు. నా స్నేహితుడి అన్నయ్యకి బొమ్మలు వేయటం వచ్చు. ఆయనకి నా కార్టూన్ ఊహ చెప్పి బొమ్మలు వేయించుకునేవాడిని. అవి పత్రికలకి పంపితే తిరిగొచ్చేవి. ఆ బొమ్మలు కూడా నేను అనుకున్నట్టు వుండేవి కాదు. అలా కాదని నేనే బొమ్మలు వేయటం నేర్చుకున్నారు. అయినా అవీ తిరిగొచ్చేవి.

TR Babu cartoonist

ఒకసారి మద్రాసులో పత్రికలో పనిచేసే నా మిత్రుడి సోదరుడిని కలిశాను. నేను వేసిన బొమ్మలు వారికి చూపించాను, ఊహలు బాగున్నాయని, బొమ్మలు ఎలా? వేస్తే పత్రికలలో ప్రచురిస్తారో సూచనలు చేశారు. అలా మరుసటి రోజే వేసి కొన్ని కార్టూన్లు గీసి చూపించాను. ఆయన వాటిలో రెండు కార్టూన్లు ఎంచుకుని తను పనిచేసే “బుజ్జాయి ” పిల్లల పత్రికలో మరుసటి నెలలోనే ప్రచురించటమే కాక పారితోషికం కూడా పంపించారు. అలా ఆయన మొదటి కార్టూన్లు ప్రయాణం 1980లో బుజ్జాయితో ప్రారంభమయ్యింది. ఆ తరువాత ఆంధ్రభూమి, కలువబాల, ఆంధ్రప్రభ, ఆనందజ్యోతి, ఆంధ్రజ్యోతి, విజయ లాంటి అనేక పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఈ
వెంకట్ అవార్డుల పోటీ నిర్వాహకులకి ఏ సైజులో కార్టూన్లు పంపాలని ఉత్తరం రాస్తే వారు సమాధానం ఇచ్చారు. ఆ పోటీలో బహుమతి రాలేదు కాని నా కార్టూన్ వారి సావనీరులో ప్రచురించారు.

ఆరోజుల్లో క్రోక్విల్ అకాడెమీ వారు కార్టూనిస్టుల కోసం కొంత సామాగ్రి పంపేవారు. అలా వచ్చినసామాగ్రితో కార్టూన్లు వేసి పత్రికలకి పంపేవాడిని. ఒకసారి హైదరాబాదులో నిర్వహించిన కార్టూన్ ప్రదర్శనకి వెళ్ళినప్పుడు ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్టు చంద్ర గారిని కలిశాను. ఆయనకి నా కార్టూన్లు చూపిస్తే వారు కొన్ని సూచనలు చేశారు. ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ సత్యమూర్తి గారు రాసిన కార్టూన్లు ఎలా? వేయాలో తెలిపే వ్యాసాలు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ జయదేవగారు ఇచ్చే సూచనలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి.

1985 నుండి 86 వరకు రెండేళ్ళు డెక్కన్ క్రానికల్ విశాఖపట్నంలో లేఔట్ ఆర్టిస్ట్ గా పనిచేశాను. ఆ సమయంలో కొన్ని పొలిటికల్ కార్టూన్లు డెక్కన్ క్రానికల్ పేపర్లో ప్రచురించబడ్డాయి. కొన్నాళ్ళు విజయవాడలో కూడా పనిచేశాను. ఆ సమయంలో ప్రముఖ కార్టూనిస్ట్ ప్రసాద్ కాజ గారితో, ఇతర కార్టూనిస్టులతో పరిచయం అయ్యింది. డెక్కన్ క్రానికల్లో పనిచేసేటప్పుడు ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేయటంలో ప్రముఖ పాత్ర పోషించటమే కాక ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశాను.

చాలా పేజీ కార్టూన్లు వేశారు. ఉద్యోగ బాధ్యతలవల్ల 1991 నుంచి 2018 వరకు కార్టూన్లు గీయలేక పోయాను. 2016లో బాచి ఫేస్ బుక్ లో నిర్వహించిన “సిరిమల్లెపువ్వల్లెనవ్వు ” లో కార్టూనిస్టా నా పరిచయం రావడంతో మళ్ళీ కార్టూన్స్ గీయాలన్న ఆసక్తి నాలో కలిగింది. 2016 నుండి తిరిగి కార్టూన్స్ వేయడం ప్రారంభించాను. ఇప్పుడు నేను వేస్తున్న కార్టూన్స్ అన్నీ మౌస్ తో గీసినవే…నేను పెన్, పేపర్ వాడడం మానేసాను. అలాగే పస్తుతం ఫేస్ బుక్ లో మాత్రమే నా కార్టూన్స్ పోస్ట్ చేస్తున్నాను.

TR Babu cartoonist

ఇప్పటివరకు సుమారు వెయ్యి కార్టూన్లు గీసాను. వివిద కార్టూన్ పోటీలలో బహుమతులు అందుకున్నాను. వాటిలో తలిశెట్టి రామారావు స్మారక అవార్డ్ పోటీల్లో వరుసగా నాలుగు సార్లు ప్రత్యేక బహుమతులు, వాగ్గేవి పురస్కారం అందుకున్నాను. ఇంకా విశాలాక్షి పత్రిక నిర్వహించిన పోటీలు, ఆంధ్రజ్యోతి –న్యూజెర్సీ(అమెరికా) సంయుక్తంగా నిర్వహించిన కార్టూన్ పోటీలు వున్నాయి.

ఉత్తరాంధ్ర కార్టూనిస్టుల కోసం “నార్త్ కోస్టల్ కార్టూనిస్టుల ఫోరం” (NCCF) ఏర్పాటు చేయటంలో ప్రముఖపాత్ర పోషించాను. ఆ సంస్థ నిర్వహించే స్థానిక కార్టూన్ ప్రదర్శనల్లో తోటి కార్టూనిస్టులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నాను. ఆ సంస్థ తరచు వివిధ సందర్భాలలో కార్టూనిస్టుల సమావేశాలు ఏర్పాటు చేస్తుంటుంది.
-టి.ఆర్.బాబు

TR Babu cartoonist

1 thought on ““డెక్కన్ క్రానికల్ “లో కార్టూన్లు గీశాను- టి.ఆర్. బాబు

  1. మీ ప్రయాణం బాగుంది బాబు గారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap