డిజైనర్లే మోడల్స్ గా మారిన వేళ…!

అపర్ణ ఫైన్ ఆర్ట్స్ ఫౌండేషన్ – ఫ్యాషన్ షో టాపర్ గా డా. ఐశ్వర్య
భారతీయ సాంప్రదాయ వస్త్రధారణతో రవీంద్రభారతి వేదిక కళకళలాడింది. భారతీయ మహిళా వస్త్రధారణకు ప్రపంచ దేశాలలో సముచిత గౌరవం, గుర్తింపు వుంది. కేవలం చీరకట్టుతో ఈ ఫ్యాషన్ షో నిర్వహించడం ప్రత్యేకత. ఫ్యాషన్ డిజైనర్లే మోడల్స్ గా మారి వారు డిజైన్ చేసిన చీరలు ధరించి వయ్యారాలు పోయారు. క్యాట్ వాక్ చేసి కనువిందు చేశారు. యువకళావాహిని, అపర్ణ ఫైన్ ఆర్ట్స్ ఫౌండేషన్, పోలెన్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ లో (3-11-23 ) శుక్రవారం (ఈ వేడుక జరిగింది. 86 ఏళ్ళ డిజైనర్ చిత్రకళాకారిణి సీత గారు, యువ డాక్టర్ ఐశ్వర్య ఈ షో లో టాపర్స్ గా నిలిచారు.

సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు, డాక్టర్ మహ్మద్ రఫీ, జి. వెంకట రెడ్డి, ఎస్. వి. రామారావు, నర్తకి శ్రీమతి కరుణ కుంచె, ఇంటీరియర్ డిజైనర్ శ్రీమతి వసుశ్రీ కపూర్, ఫ్యాషన్ డిజైనర్ అల్కా మనోజ్ తదితరులు పాల్గొని మహిళా ఫ్యాషన్ డిజైనర్లను అభినందించారు. చీరలపై సృష్టించిన అద్భుత డిజైన్లను ప్రశంశించారు.

మిస్ గ్లోబ్ ఇండియా 2023 టైటిల్ గెలుచుకున్న డాక్టర్ ఐశ్వర్య ను యూత్ ఐకాన్ పురస్కారంతో సత్కరించారు. ప్రముఖ కథక్ నాట్య గురువు పి. రవీందర్ రాజు శిష్యులు కథక్ నాట్యం ప్రదర్శించి కరతాళధ్వనులు అందుకున్నారు. యువకళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీనారాయణ, సంధ్యా వర్షిణి, అపర్ణ, సోనా కపూర్ సమన్వయం చేశారు.

డాక్టర్ మహ్మద్ రఫీ

SA: