సంజీవి ఆత్మకథ త్రేతాగ్ని అవిష్కరణ

బాలనటుడిగా, నాటక రచయితగా, సినీ రచయితగా, దర్శకుడిగా ఆరు దశాబ్దాలుగా కృషిచేసిన సంజీవి రాసిన త్రేతాగ్ని పుస్తకం 2021, ఆగస్టు 12న హైదరాబాదు రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో అవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డా. కె.వి. రమణాచారి, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, రంగస్థల నటులు, దర్శకులు ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ మాజీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, దైవజ్ఞశర్మ, సినీ టివి దర్శకులు, నటులు నాగబాల సురేష్ కుమార్, సినీ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, లయన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.

Written by Sanjeevi

సంజీవి సెప్టెంబర్ 24న కృష్ణా జిల్లా, విజయవాడలో జన్మించారు.
రంగస్థల ప్రస్థానం: 1965లో నటనాలయం నాటకంలోని చిట్టిబాబు పాత్ర ద్వారా నాటకరంగంలోకి అడుగుపెట్టిన సంజీవి నటుడిగా, రచయితగా, దర్శకుడిగా అనేక నాటక నాటికలకు పనిచేశాడు. గురజాడ కళామందిరం అనే సంస్థను స్థాపించి, గత 40 ఏళ్ళుగా నాటక ప్రదర్శనలను ఇస్తున్నారు.

నటనాలయం (నాటకం)లోని సంజీవి నటనను చూసి బి.ఎన్. రెడ్డి తన రంగులరాట్నం (1966) సినిమాలో బాలనటుడి వేషం ఇచ్చాడు. దాదాపు 50కిపైగా చిత్రాలకు నటుడిగా, రచయతగా పనిచేశాడు. సంజీవి రచనలో రాజశేఖర్ నటించిన ‘అన్న’ చిత్రం నాలుగు నంది అవార్డులు అందుకోవడమేకాకుండా, ఆస్కార్ అవార్డుకు కూడా నామినేట్ అయింది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో విజయశాంతి నటించిన ఒసేయ్ రాములమ్మా చిత్ర రచనలో కూడా సంజీవి తన సహకరించాడు. ఈ చిత్రం అంతకుముందున్న బాక్సాఫీస్ రికార్డులను అధిగమించడమేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుండి అనేక అవార్డులతోపాటూ ఉత్తమ నటి విభాగంలో జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈయన రచయితగా చేసిన మరో సినిమా ఎర్రమందారం ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు విభాగాల్లో రాష్ఱ్ర ప్రభుత్వ అవార్డులు, జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా భారత ప్రభుత్వ అవార్డు గెల్చుకుంది. ఎర్రసైన్యం, ఒరేయ్ రిక్షా, సమ్మక్క సారక్క వంటి చిత్రాలకు పనిచేసిన సంజీవి తమిళ సినిమా, కన్నడ సినిమా రంగంకు కూడా పనిచేశాడు. అంతేకాకుండా ఛాయా (1981), తెలుగోడు (2014) వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

నంది అవార్డులు:
ఉత్తమ నటుడు – నిజాయితి (నాటిక) – 2000, ఉత్తమ నాటకం – మధురం, ఉత్తమ రచన – శివరంజని, నాలుగు అవార్డులు – గబ్బిలం (నాటిక), రెండు అవార్డులు (నంది నాటక పరిషత్తు – 2005) అందుకున్నారు.
పురస్కారాలు:
మహాకవి గురజాడ స్మారక పురస్కారం, కళా విరించి – గుంటూరు, పీపుల్స్ రైటర్ – జవ్వాది ట్రస్టు, దాసరి ప్రతిభా పురస్కారం – 2018 వంటి పురస్కారాలు అందుకున్నారు.

SA: